రాజశేఖర్ ఇంటి వద్ద సంబరాలు

రాజశేఖర్ కి చాలా కాలం తర్వాత 'పి ఎస్ వి గరుడవేగ' తో మంచి విజయం దక్కింది. దాదాపు రెండేళ్ల తర్వాత వెండి తెరపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'పి ఎస్ వి గరుడవేగ' తో వచ్చి నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాడు. పూజా కుమార్, శ్రద్ధాదాస్, సన్నీలియోన్ మొదలగు వారు ముఖ్య తారాగణంతో నవంబర్ 3న అత్యధిక ధియేటర్లలో పి ఎస్ వి రిలీజైంది. విడుదల అయిన ప్రతి చోట హిట్ టాక్ రావడంతో యూనిట్ సంబరాలులో మునిగిపోయింది.
అయితే చాలా కాలం తర్వాత ఈ సినిమా హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ తో పాటు రాజశేఖర్ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ ఆనందాన్ని చిత్ర యూనిట్‌తో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ ఇల్లంతా గరుడవేగ కాంతులతో నిండిపోయింది. తన ఇంటి వద్ద చిత్ర యూనిట్‌తో కలిసి రాజశేఖర్ డ్యాన్స్‌లు చేస్తూ అలరించారు. రాజశేఖర్ తో పాటు తన కూతుర్లు, శ్రద్ధాదాస్, ప్రవీణ్ సత్తారు, జీవిత డాన్సులు వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం రాజశేఖర్ ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొని ఉంది.

