Sun Dec 28 2025 21:26:24 GMT+0000 (Coordinated Universal Time)
రాఘవేంద్రుడు.. ఎన్టీఆర్.. అదిరిందయ్యా కాంబినేషన్

కె.రాఘవేంద్ర రావు ప్రస్తుతం నాగార్జునతో 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా భక్తిరస చిత్రం గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ జోనర్ లో నాగార్జునతో 'అన్నమయ్య, శ్రీరామ దాసు' చిత్రాలను తీసిన రాఘవేంద్ర రావు ఇప్పుడు నాగార్జున హీరోగా 'ఓం నమో వెంకటేశాయ'తో మరో సారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం తర్వాత రాఘవేంద్ర రావు జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నాడనే టాక్ బయటికి వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని అంటున్నారు. 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ తో చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కె.రాఘవేంద్ర రావు కి ఎన్టీఆర్ కి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు. మరి కరెక్ట్ గా వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అనేది మాత్రం తెలీదు. అయితే ఎన్టీఆర్ ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ కి కమిట్ కాలేదు గనక ఈ కాంబినేషన్ ఖచ్చితం గా సినిమా ఉంటుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. మరి ఈ సినిమా పౌరాణికమా లేక సోషియో ఫాంటసీనా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. మరి రాఘవేంద్ర రావు కాంబినేషన్ సినిమాలో వస్తే ఎన్టీఆర్ కెరీర్ కి బాగా ప్లస్ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారట.
Next Story

