రవితేజ ఈజ్ బ్యాక్!

దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు మన మాస్ మహా రాజా రవి తేజ. అందరు హీరోలు చకచకా సినిమాలు మీద సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతుంటారు. కానీ రవి తేజ మాత్రం నిధానంగా సినిమాలు తీస్తుంటాడు. ఆలా రెండేళ్లు తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. దిల్ రాజు బ్యానర్ లో 'రాజా ది గ్రేట్' అనే సినిమా లో నటించాడు. ఇందులో రవి తేజ అంధుడిగా నటించాడు. మరి ఈ సినిమాలో రవి తేజ నటన ఎలా ఉందొ తెలుసుకుందామా...
'పటాస్, సుప్రీమ్' వంటి సినిమాలు తీసిన అనిల్ రావిపూడి ఈ సినిమా దర్శకత్వం చేసాడు. సినిమా మొదటి నుండి చివరిదాకా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా సాగింది. రవి తేజకి అమ్మగా సీనియర్ హీరోయిన్ రాధిక యాక్ట్ చేసింది. రాధికకి తన కొడుకు పోలీస్ ఆఫీసర్ అవలనదే రాధిక కోరిక. మొదటి నుండి చివరి వరకు కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ కథలో రవి తేజ తన డైలాగ్ డెలివరీ తో గాని, తన నటనతో గాని ప్రేక్షకులని నవ్వించి మెప్పించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రవి తేజ మొదటి నుండి చివరి దాక చింపేసాడు. రాజా ది గ్రేట్ సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు 'రవి తేజ ఈజ్ బ్యాక్' అంటున్నారు.
ప్రస్తుతం రవి తేజ 'టచ్ చేసి చూడు' అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడిందనే టాక్ వుంది

