రవితేజ అంతు చూస్తానంటున్న జగపతి బాబు!

కళ్యాణ్ కృష్ణ తన మూడో ప్రాజెక్ట్ ని రవితేజ హీరోగా మొదలు పెట్టబోతున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాతో సక్సెస్ అందుకున్న రవితేజ ప్రస్తుతం టచ్ చేసి చూడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమా జనవరి నెలాఖరున విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా వున్నాయి. ఇకపోతే రవితేజ - కళ్యాణ్ కృష్ణ కలయికలో రూపొందుతున్న సినిమా జనవరి 5 న ప్రారంభమై.. జనవరి నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అయితే రవితేజ - కళ్యాణ్ కృష్ణ సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారట.
మరి రవితేజ సరసన ఒక కొత్త హీరోయిన్ నటించబోతుందని చెబుతున్నారు. మాళవిక శర్మ అనే కొత్తమ్మాయి ని దర్శకుడు కళ్యాణ్ హీరోయిన్ గా ఈ సినిమాకి సెలెక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇకపోతే లెజెండ్ చిత్రం తో విలన్ గా సినిమాల్లోకి రి ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడనే టాక్ వినబడుతుంది. మరి పవర్ ఫుల్ విలన్ గా కమ్ బ్యాక్ అయిన హీరో జగపతి బాబు రవితేజ తో ఎలా తలపడనున్నాడో చూద్దాం. ఇక ఈ సినిమాని ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నాడు.

