రకుల్ రికమెండ్ చేసిన ఆ హీరోయిన్ ఎవరు?

బాలకృష్ణ నటించిన, పూరి దర్శకత్వం లో వచ్చిన చిత్రం 'పైసా వసూల్'. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు తీసుకుపోతుంటాడు పూరి. తన కొడుకైన ఆకాష్ పూరిని హీరోగా పెట్టి 'మెహబూబా' అనే మూవీ తీస్తున్నాడు. ఈ మూవీకి కన్నడ భామ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
కన్నడలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ అమ్మాయి ఒక్కసారిగా పూరి మూవీలో ఛాన్స్ కొట్టేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ అవకాశం వెనకాల హీరోయిన్ రకుల్ ఉందని తెలుస్తుంది. రకుల్ కి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. నేహా శెట్టి బాయ్ ఫ్రెండ్ పేరు అమన్.. ఈ అమన్ రకుల్ కి సొంత తమ్ముడు. అమన్ - నేహా శెట్టి బాగా క్లోజ్ ఎంత క్లోజ్ అంటే వేళ్ళు లవర్స్ ఏమో... అన్న అనుమానం కూడా కలుగుతుంది.
అందుకే పూరిని రికమెండ్ చెయ్యమని అమన్ ద్వారా నేహ కోరడం తో వెంటనే రకుల్ ఆమెని ఆడిషన్ కి రమ్మని అడగడం, నేహ శెట్టి ఆడిషన్ కి రావడం సెలెక్ట్ అయిపోవడం అన్ని అలా జరిగిపోయాయి. అలా రకుల్ రికమండ్ చేయటంతో పూరి తీస్తున్న సినిమా 'మెహబూబా'లో నేహాశెట్టికి ఛాన్స్ వచ్చిందనే టాక్ బయట గట్టిగా ఉంది.

