రకుల్ ఆ వార్తలని ఖండించింది!

టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్గా బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ఇక్కడ ఆఫర్స్ తగ్గిపోయినందుకే బాలీవుడ్ కి మకాం మార్చిందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ప్రచారాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖండించింది. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆమె తెలిపింది.
సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో నేను కొన్ని తప్పు చేశాను అని చెప్పింది. తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేసే పరిస్థితులు వచ్చాయి అని తెలిపింది. కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల కొన్ని చేయాల్సి వస్తుందని..అవి కూడా తప్పులు జరగడానికి కారణమవుతాయని చెప్పింది.
ఇకపై అటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పింది. అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ లో 'అయ్యారీ' సినిమా నిరాశపరిచినప్పటికీ..తన నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయని తెలిపింది. త్వరలోనే తమిళ్ లో ఒక సినిమా..తెలుగు లో ఒక సినిమా చేయబోతున్న అని చెప్పింది.

