యువ దర్శకుడిని పొగడ్తలతో ముంచేసిన మలయాళ భామ

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవ్వటమే త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి పెద్ద దర్శకుడు తెరకెక్కించిన అఆ చిత్రంతో పరిచయమై ఆ చిత్ర విజయంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు తెలుగులో రెండవ చిత్రం అక్కినేని నాగ చైతన్య సరసన ప్రేమమ్ చిత్రంలో నటిస్తుంది. మలయాళ ప్రేమమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ తాను మలయాళ ప్రేమమ్ లో పోషించిన పాత్రనే తెలుగులోనూ పోషిస్తుంది.
మళయాళ చిత్ర పరిశ్రమకు తెలుగు చిత్ర పరిశ్రమకు చాలా వ్యత్యాసమే ఉంది అని అభిప్రాయపడింది అనుపమ పరమేశ్వరన్. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ వాతావరణానికి కూడా చాలా త్వరగా ఇమిడిపోయానని దానికి కారణం ప్రేమమ్ చిత్ర దర్శకుడు చందు మొండేటి నేనని చెప్పింది. "తెలుగులో పని చేస్తున్న రెండవ చిత్రమే అయినా ఏ ఇబ్బంది కలగలేదు. పూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమకు అలవాటు ఐపోయాను. చందు మొండేటి మొదట్లో నా ఇబ్బందిని గ్రహించి ఎంతో సౌకార్యమైన వాతావరణాన్ని కలిపించారు. మలయాళ ప్రేమమ్ లోని నా పాత్ర మేజిక్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది." అని చిత్ర విశేషాలు పంచుకుంది అనుపమ పరమేశ్వరన్.
ప్రేమమ్ చిత్రం ఈ నెల 7 వ తారీఖున విడుదలకు సిద్ధం అవుతుంది. శర్వానంద్ చిత్రం శర్వానం భవతే చిత్రంలో కథానాయిక పాత్రలో కనిపించనుంది అనుపమ పరమేశ్వరన్.

