మొదలు పెట్టేసింది

మిస్ వరల్డ్ గా ఇండియా నుండి ఎంపికైన మానుషీ చిల్లర్ తన ఐడెంటిటీని చాటుకుంటుంది. మిస్ వరల్డ్ కిరీటాన్ని మోస్తున్న మానుషీ చిల్లర్ నెక్స్ట్ స్టెప్ మోడలింగ్ తోపాటు బాలీవుడ్ ఆఫర్స్ అంటూ తెగ వార్తలు హల్చల్ చేశాయి. కేవలం వార్తలేకాదు మానుషీ చిల్లర్ ని కరణ్ జోహార్ బాలీవుడ్ కి గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నాడంటూ ఒకటే వార్తలు ఊదరగోట్టాయి. కానీ మానుషీ చిల్లర్ ఒక ప్రెస్ మీట్ లో తనకి ఇప్పట్లో నటించే ఉద్దేశ్యం లేదని... అలాగే తనకి అమీరా ఖాన్ సినిమాలంటే ఇష్టమని.... అయన సినిమాలు సందేశాత్మకంగా ఉంటాయని సెలవిచ్చింది.
కట్ చేస్తే.. మానుషీ చిల్లర్ ఒక మ్యాగజైన్ కోసం ఇచ్చిన హాట్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాదు... అమ్మడు బాలీవుడ్ మీద మోజుపడుతుంది. ఆ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ ఇచ్చిన ఈ అమ్మడు తన మనసులోని మాట బయటపెట్టింది. తన నెక్ట్స్ టార్గెట్ వెండితెర అని ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసింది. మరి ఇలా మిస్ వరల్డ్ గా కిరీటాన్ని దక్కించుకున్న అందరూ వెండితెరను ఏలిన వారే. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కానప్పటికీ.... మిస్ వరల్డ్, మిస్ ఇండియా లు చేసే పని గ్లామర్ ఫీల్డ్. మరి దానికి మానుషీ చిల్లర్ కూడా అతీతం కాదు.
అందరి మిస్ వరల్డ్ లాగే తనకి వెండితెర పైన కనబడాలని.... అందరిలా తాను సినిమాల్లో బిజీ అవ్వాలని అమ్మడు కలలు కనడం మొదలు పెట్టేసింది. మరి మానుషీని గ్రాండ్ గా బాలీవుడ్ నుండి వెండితెరకు లాంచ్ చేసే దర్శక నిర్మాతలెవరో? అలాగే మానుషీ పక్క నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరో అంటూ అప్పుడే బాలీవుడ్ లో పజిల్స్ మొదలయ్యాయి




