మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి చేశారా..?

మళయాళనాటి భావన కిడ్నాప్ కేసు విషయంలో మలయాళ స్టార్ హీరో దిలీప్ తప్పించుకోవడానికి వీలులేకుండా ఇరుక్కున్న సంగతి తెలిసిందే. భావన మీద పగ సాధిచడం కోసం హీరో దిలీప్ చేసిన నీచమైన పనికి అతనిప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కెడుతున్నాడు. కేవలం తన భార్యకి భావన తనగురించి నిజం చెప్పిందన్న ఒక్క విషయంతో దిలీప్, భావన మీద కక్ష పెంచుకున్నాడు. అయితే దిలీప్ తన భార్యకి విడాకులిచ్చి మలయాళంలో ఉన్న మరో హీరోయిన్ కావ్య మాధవన్ ని వివాహమాడాడు.
ఇక కావ్య మాధవన్, దిలీప్ ని వివాహం చేసుకున్నాక కూడా ఆమె హీరోయిన్ గా మలయాళ పరిశ్రమలోనే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు భావన కిడ్నాప్ కేసు దిలీప్ రెండో భార్య కావ్య మాధవన్ కి కూడా చుట్టుకునే టట్లు ఉందంటున్నారు. భావన కేసు విషయంలో కావ్య మాధవన్ ను పోలీస్ లు విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే కావ్య మాధవన్ కు సంబందించిన ఒక బట్టల షాప్ లో పోలీస్ లు సోదాలు చేసి కీలమైన ఆధారాలు సేకరించినట్లు వార్తలొస్తున్నాయి.
అయితే కావ్య మాధవన్ దిలీప్ కి కిరాయి రౌడీలకు మధ్యవర్తిత్వం చేసినట్లుగా చెబుతున్నారు. కావ్య మాధవన్ తెర వెనుక ఉండి భావన కిడ్నాప్ వ్యవహారం చక్కబెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి.

