మెహ్రీన్ భలే ఛాన్స్ కొట్టేసింది

ఫస్ట్ సినిమా లో తన నటనతో మెప్పించి అందరి దగ్గర నుంచి మంచి మార్కులు సంపాదించుకుంది హీరోయిన్ మెహ్రీన్. చేసింది తక్కువ సినిమాలే అయినా చాలా వరకు పెద్దగా ఆడలేదు. రీసెంట్ గా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తో మల్లి ఫామ్ లోకి వచ్చే అవకాశాలు కనిపించాయి. కానీ ఆ సినిమా తర్వాత ఏ సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో అవకాశాలు అంతగా పలకరించడంలేదు.
ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండకు జోడిగా నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' .. 'ఏ మంత్రం వేశావే' లతో మన ముందుకు రానున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత విజయ్..తమిళంలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.
ఈనెల నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే విజయ్ పక్కన కథానాయికగా మెహ్రీన్ అయితే బాగుంటుందని భావించి ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. తర్వరలోనే ఈ డీటెయిల్స్ ను అధికారంగా ప్రకటించనున్నారు చిత్ర యూనిట్. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదలకానుంది.

