Tue Dec 30 2025 15:04:07 GMT+0000 (Coordinated Universal Time)
మెగా హీరోలకే ఓటేసిన ప్రభు దేవా

ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటే ప్రభుదేవా అని అందరూ ఇట్టే చెప్పేస్తారు. అయితే ప్రభుదేవా ఎప్పుడూ డాన్స్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ దర్శకత్వానికి ఇస్తున్నాడని ఇటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిన ప్రభుదేవా అక్కడ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ నిలదొక్కుకుని అక్కడ హిట్ సినిమాలు అందిస్తూ నిలబడిపోయాడు. అయితే ఇతను మంచి డాన్స్ మాస్టర్ గా అందరికి తెలుసు గాని... ఇతనికి నచ్చిన డాన్స్ చేసే హీరో లు ఎవరో తెలుసా ఒకసారి మీరే చూడండి. ప్రభుదేవా ఇష్టపడే ఆ డాన్స్ హీరోలు వీరే. ఒకరు అల్లు అర్జున్ ఆయన ఈ మధ్య చేసిన 'జులాయి' సినిమాలో టాపు లేచిపోద్ది పాట కి బన్నీ వేసిన డాన్స్ అంటే ఇష్టమని ఇంకా రెండోహీరో రామ్ చరణ్ అంట. చరణ్ 'బ్రూస్ లీ' లో వేసిన మెగా మీటర్ సాంగ్ స్టెప్స్, ఇక మూడో హీరో జూనియర్ ఎన్టీఆర్ అట. ఎన్టీఆర్ ఏ సాంగ్ అనుకుంటున్నారా అదేనండి 'నాన్నకు ప్రేమతో' లో ఐవానా ఫాలో ఫాలో పాతాళ స్టెప్స్న బాగా నచ్చాయని అంటున్నాడు. అసలు తెలుగులో కూడా మంచి డాన్స్ మాస్టర్స్ వున్నారని అంటున్నాడు.
అయితే ప్రభుదేవాకి దర్శకత్వం కంటే డాన్స్ అంటేనే పిచ్చంట. డాన్స్ లో ఉండే తృప్తి ఇంకా దేనిలోని ఉండదని అంటున్నాడు. అసలిప్పటికీ నాకు డాన్స్ వేయాలన్న... లేకుంటే కంపోజ్ చెయ్యాలన్నా చాలా ఇష్టమని చెబుతున్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా హైదరాబాద్ లోనే వున్నాడు. ఈయన 'అభినేత్రి' కి సంబంధించి పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ బిజీ గా గడుపుతున్నాడు.
Next Story

