మెగా స్టార్ ఆహ్వానాన్ని తిరస్కరించిన స్టార్ ఎవరో

యంగ్ హీరో నాగ శౌర్య తన తాజా చిత్రం చలో తో వచ్చే శుక్రవారం (2 ఫిబ్రవరి) నాడు ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ లో భాగంగా నిన్న (గురువారం 25 జనవరి) సాయంతరం ప్రీ రిలీజ్ వేడుకని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా మెగా స్టార్ చిరంజీవి విచ్చేసి చిత్ర బృందాన్ని, ప్రత్యేకంగా హీరో నాగ శౌర్య ని విష్ చేశారు. మెగా స్టార్ తన ప్రసంగంలో భాగంగా అసలు తాను ఈ వేడుకకి ఎందుకు హాజరు అయ్యారో వివరించారు. ఈ వివరణలో నుంచి ఇప్పుడు జవాబు దొరకని ఒక ప్రశ్న ప్రేక్షకులని వెంటాడుతోంది.
మెగా స్టార్ చిరంజీవి చలో ప్రీ రిలీజ్ వేడుక వేదిక పై ప్రసంగిస్తూ, నాగ శౌర్య తనని ముఖ్య అతిధిగా ఆహ్వానించటానికి వచ్చినప్పుడు అతడిలో తనని తాను చేసుకున్నానని, తన కెరీర్ తొలి నాళ్ళల్లో తాను నటించిన ఒక చిత్ర శతదినోత్సవ వేడుకకి తాను ఎంతగానో అభిమానించే నటుడిని ప్రత్యేక అతిధిగా ఆహ్వానిస్తే ఆయన బిజీ షెడ్యూల్ కారణాన ఆహ్వానాన్ని తిరస్కరించారని, అప్పటికి ఆ వేడుక జరిగినప్పటికీ తాను ఎంతగానో నిరాశ చెందినట్టు చెప్పారు చిరంజీవి. అలానే హీరోగా మంచి రేంజ్ కి ఎదుగుతున్న శౌర్య తనని ఆహ్వానించినప్పుడు నాకు ఆ సందర్భము గుర్తు వచ్చి తనకి ఎదురైన నిరాశ, నిరుత్సాహం అతనికి ఎదురుకాకూడదనే ఈ వేడుకకి హాజరయ్యానని పేర్కొన్నారు మెగా స్టార్. అయితే తన ఆహ్వానాన్ని తిరస్కరించిన ఆ బడా స్టార్ ఎవరో పేరు మాత్రం రివీల్ చేయలేదు చిరు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ యాక్టర్ ఎవరై వుంటారనేదాని పై అనేక పోల్స్ ప్రారంభమయ్యాయి.

