మెగా కూతురు భలే క్యూట్ గా ఉంది!

సాధారణంగా స్టార్ హీరో కూతుర్లు సినీ ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే వారి కోసం చాలా మంది అభిమానులు ఓ తరహాలో ఎదురుచూస్తుంటారు. కానీ టాలీవుడ్ లో ఓ హీరోయిన్ ఎంట్రీ ఇందుకు భిన్నంగా ఉంది. అసలు ఎటువంటి హడావిడి లేకుండా చాలా కూల్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ హీరోయిన్. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే... మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోస్ బయటికి వచ్చారు. కానీ ఆ ఫ్యామిలీ నుండి ఒకేఒక్క అమ్మాయి నాగ బాబు కూతురు నిహారిక హీరోయిన్ గా టాలీవుడ్ తెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
మొదట టీవీ షోస్ తో దగ్గర ఐన నిహారిక మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీ ఓ క్యూట్ లవ్ స్టోరీతో అందరి మనసులు దోచుకుంది. అయితే లేటెస్ట్ గా నిహారిక ఒక ఫొటోషూట్ లో ఇచ్చిన స్టిల్ లో ఉహించని విధంగా కనిపించింది. బాలీవుడ్ హీరోయిన్స్ ని తలపించేలా వుంది అంటున్నారు మెగా ఫ్యాన్స్.
మోడరన్ గర్ల్ లా బ్లూ జీన్స్ వైట్ టిషర్ట్ లో నవ్వుతూ టేబుల్ మీద కూర్చున్న నిహారిక చాలా అందంగా కనిపించింది. సరికొత్త హెయిర్ స్టైల్ తో నిండుగా ఒక స్మైల్ ని తగిలిచడంతో ఫొటో కి కళ వచ్చిందని చెప్పవచ్చు. ఇంతవరకు నిహారిక ఇంత క్యూట్ గా ఎప్పుడు కనిపించలేదని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.


