ముందు శ్రీను వైట్లే అంటున్న లోఫర్

తెరాన్గ్రేటం చేసిన కొద్దికాలానికే మూడు చిత్రాలు విడుదల అయ్యేలా చూసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అదే జోరుతో తన తదుపరి చిత్రాలుగా ఒకే సారి రెండు చిత్రాలను అధికారికంగా ప్రకటించేశాడు.వాటిల్లో ఒకటి శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కుతున్న మిస్టర్ కాగా మరొక చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫిదా చిత్రం. ఇటీవల మిస్టర్ చిత్రం సంబంధించిన ఊటీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి ఐయ్యింది. ముందుగా నిర్ణయించబడ్డ ప్రణాళిక ప్రకారం ఊటీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న వెంటనే వరుణ్ తేజ్ శేఖర్ కమ్ముల చిత్రం షెడ్యూల్ చెయ్యాల్సి వుంది.
కాకపోతే ఊటీ షెడ్యూల్ చిత్రీకరణలో ప్రమాదానికి గురై వరుణ్ తేజ్ కాలుకి తీవ్ర గాయం కావటంతో వైద్యులు వరుణ్ కి రెండు నెలలు విశ్రాంతి పొందవలసినదిగా సూచించారు. దాంతో ముందుగా అనుకున్న ప్రణాళిక మార్పులకు గురైయ్యింది. ప్రస్తుతం విశ్రాంతి లో వున్నా వరుణ్ గాయం నయం ఐన వెను వెంటనే శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ చిత్రీకరణ పూర్తి చెయ్యాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజం అయితే ఫిదా చిత్రం 2017 వేసవికి కూడా రానట్టే. కానీ తన గాయం వల్ల ఇద్దరు నిర్మాతలని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ముకుంద, కంచె చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుని శేఖర్ కమ్ముల వంటి కూల్ డైరెక్టర్ దగ్గర అవకాశం పొందాడు వరుణ్. సో ఆ చిత్రం లేట్ గా వచ్చినా ఫ్రెష్ గా వుండాలని అనుకున్నాడేమో...

