మార్పులు చేర్పులా?

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నఈ సినిమాని ఏప్రిల్ లో విడుదలకు భరత్ మేకర్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కథని ఎప్పుడో పకడ్బందీగా కొరటాల శివ లాక్ చేసాడు. కానీ ఈ మధ్యన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా సినిమా ట్రైలర్ విడుదల కాగానే ఈ సినిమా ఏదో హాలీవుడ్ సినిమాకి రీమేక్ అని.. అలాగే ఏదో పర భాష సినిమాకి కాపీ అనే మాటలు వినబడుతున్నాయి. ఇక ఇప్పుడు మహేష్ - కొరటాల సినిమా కూడా ఈ మధ్యనే విడుదలైన ఒక సినిమా కథ లాగే ఉందని ప్రచారం మొదలైంది.
మరి ఇలా మరో సినిమాకి భరత్ అనే నేను కి పోలికలు ఉన్నట్లుగా వస్తున్న గుసగుసలకి కొరటాల ఎలెర్ట్ అయ్యాడట. అందుకే ఇప్పటివరకు షూట్ చేసిన భరత్ అనే నేను షూటింగ్ లో కొన్ని మార్పులు .. చేర్పులకు కొరటాల సిద్ధమయ్యాడని గుసగుసలు విబడుతున్నాయి. ఇప్పటివరకు షూటింగ్ చేసిన సన్నివేశాలతో పాటే ఇక ముందు చేయవలసిన వాటి విషయంపై కొరటాల, మహేశ్ బాబుతో చర్చినట్టు సమాచారం. అలాగే ఈ చర్చలకు భరత్ అనే నేను ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ను కూడా పిలిచినట్లుగా వార్తలొస్తున్నాయి.
మహేష్ - కొరత - ఎడిటర్ శ్రీకర ప్రసాద్ లు కలిసి చర్చించుకుని భరత్ అనే నేను లోని మార్పులను చేర్పులను ఫిక్స్ చేసేసారట. మరి మహేష్ గత సినిమాల డిజాస్టర్స్ విషయంలో బాగా ఇబ్బందిపడి ఉండడం వలన... ఇప్పుడు భరత్ అనే నేను విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెడుతున్నాడట.