మారుతి ఆఫర్ కి కంగారు పడుతున్న చైతు!

నాగ చైతన్య - మారుతి కలయికలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎప్పుడో అక్కినేని వారసుడు అఖిల్ ని దర్శకత్వం చేద్దామనుకున్న దర్శకుడు మారుతికి ఇప్పుడు అక్కినేని మరో వారసుడు నాగ చైతన్య దొరికాడు. అయితే 'మహానుభావుడు' చిత్రం షూటింగ్ ని పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తున్న మారుతి ఆ చిత్రం తర్వాతే నాగ చైతన్యతో సినిమాని చేసే ప్లాన్ లో ఉన్నాడు. శర్వానంద్ - మెహరీన్ జంటగా మారుతి తెరకెక్కించిన మహానుభావుడు చిత్రం ఈ నెలాఖరున దసరాకే విడుదలకాబోతుంది. ఇక నాగ చైతన్య కూడా పెళ్లి తర్వాత మారుతి దర్శకత్వంలో నటించే ఛాన్స్ ఉంది.
అయితే మారుతీ - నాగ చైతన్య కలయికలో రాబోతున్న సినిమాలో నాగ చైతన్య కి జోడిగా చైతు కి కాబోయే భార్య సమంత నటిస్తే బావుంటుంది అని మారుతి అనుకుంటున్నాడట. ఇదే విషయాన్నీ నాగ చైతన్య కి చెప్పి మీరిద్దరూ కలిసి నటిస్తే ఈ సినిమాకి బోలెడంత క్రేజ్ వస్తుందని కూడా చెప్పాడట. మరి నాగ చైతన్య - సమంతలు గత కొన్నేళ్లకుగా ప్రేమలో ఉండి చివరిగా పెళ్లి పీటలెక్కుతూ తమ ప్రేమను సాకారం చేసుకుంటున్నారు. ఇటువంటి టైం లో వారిద్దరూ కలిసి జోడి కడితే సినిమాకి మామూలు హైప్ క్రియేట్ అవదనే ఆలోచనతోనే మారుతి ఈ డెసిషన్ తీసుకున్నాడట. అయితే నాగ చైతన్య మాత్రం ఈ విషయంలో కొద్దిగా టెన్షన్ పడుతున్నాడట.
అదే విషయాన్ని చైతూ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. పెళ్లైయ్యాక ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఆ సినిమా ఒకవేళ విజయ సాధించకపోతే గనక ఆ ఎఫెక్ట్ తమ పర్సనల్ లైఫ్ మీద పడే అవకాశం ఉటుంది కాబట్టి ఇలాంటి రిస్క్ తీసుకోవడం అవసరమా అని భావిస్తున్నాడట చైతూ. ఇక నాగ చైతన్య సన్నిహితులు కూడా ఎవరి సినిమాలు వారు చేసుకోండి ఇలా ఒకే సినిమాలో కలిసి నటించి ఇబ్బందులు పడడం ఎందుకులే అనే సలహా ఇస్తున్నారట. మరి నాగ చైతన్య సన్నహితుల సలహా కి కట్టుబడతాడో... లేకుంటే మారుతీ డెసిషన్ కి తలొగ్గుతాడో అనేది మాత్రం కొద్దీ రోజులు ఓపిక పడితే తెలుస్తుంది.

