మాజీ సీఎంపై కాలుదువ్వుతున్న ఐటెం బాంబ్

బాలీవుడ్లో హాట్ యాక్ట్రెస్ గా, ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్న రాఖీ సావంత్ గత కొంత కాలంగా అవకాశాలు చేజిక్కించుకోలేక సతమతమవుతుంది. ఇక సినిమాలపై పూర్తిగా ఆశ చంపుకుందో ఏమో గత సార్వత్రిక ఎన్నికలలో తానే స్వయంగా సొంత పార్టీ స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసింది. అప్పటి నుంచి రిపబ్లిక్ పార్టీ అఫ్ ఇండియా పార్టీ అధ్యక్షరాలుగా కొనసాగుతుంది రాఖీ సావంత్. ఇప్పుడు రానున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనటానికి రంగం సిద్ధం చేసుకుంటుంది రాఖీ సావంత్.
తాజాగా తన ప్రత్యక్ష పోటీ గురించి తన పార్టీ సభ్యులతో అధికారిక ప్రకటన చూపించింది రాఖీ సావంత్. ఏ శాసన సభ స్థానానికి పోటీ చెయ్యాలని ఇంకా నిర్ణయం కానప్పటికీ ప్రత్యర్థిని మాత్రం ముందుగానే నిర్ణయించేకున్నారు రాఖీ మరియు ఆవిడ అనుచరులు. రాఖీ సావంత్ మాజీ ముఖ్య మంత్రి బీఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతి పై పోటీకి నిలబడతారు అని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ సభ్యులు ప్రచారం మొదలు పెట్టారు. కాగా గత శాసన సభ ఎన్నికలలో ఓటమి చవి చూసిన మాయావతి ప్రస్తుతం రాజ్య సభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ మళ్లీ రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో పోటీ చేస్తారో లేదో తేలాల్సి వుంది.

