మహేష్ సినిమా వచ్చేది ఏప్రిల్ 20 న కాదు

సూపర్ స్టార్ మహేష్ బాబు 'స్పైడర్' సినిమా విడుదల కాకముందే తన కెరీర్ లో 'శ్రీమంతుడు' వంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను సినిమాను మొదలు పెట్టేసాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు పాలిటిక్స్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల. ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీగా వేసిన సిఎం క్యాంప్ ఆఫీస్ సెట్లో కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ జరుపుకుంటుంది. అభిమానుల అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా రాజకీయ కోణానికి కమర్షియల్ అంశాలను కలిపి గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల.
అయితే కొరటాల - మహేష్ కలయికలో ఈ సినిమా మొదలుపెట్టుకున్నప్పుడు వచ్చే సంక్రాంతికల్లా రెడీ చేసేసి విడుదల చేస్తారని అన్నారు. కానీ ఆ తర్వాత పవన్ సంక్రాతి బరిలో ఉన్నాడు కాబట్టి ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్ నెల 20న విడుదల చేస్తారని రూమర్ బయట నడిచింది. కానీ ఇప్పుడు తాజాగా ఈ సినిమా కి సంబంధించిన రిలీజ్ డేట్ బయటకి వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న 'భరత్ అనే నేను' సినిమా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం కూడా ధ్రువీకరించింది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

