మహేష్ సర్దుబాట్లు మొదలయ్యాయి

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం, స్పైడర్ ల బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో అభిమానులని నిరాశపరిచాడు. ఈ రెండు చిత్రాలకి పంపిణీదారులు చాలా పెద్ద మొత్తం లో నష్టపోయిన విషయం అందరికి తెలిసిందే. ఒక వైపు అభిమానులని, సినిమా ప్రేక్షకులని భరత్ అనే నేను తోనైనా నిరుత్సాహపరచుకుండా మినిమం గ్యారంటీ చిత్రంగా మలిచేందుకు దర్శకుడు కొరటాల శివతో కలిసి స్క్రిప్ట్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ప్రతి షాట్ షూట్ చేస్తున్నాడు. అలానే అనుమానం వున్న భాగాలని రీషూట్ చేయటానికి కూడా వెనుకాడటం లేదు మహేష్.
అభిమానులని ఒక్క హిట్ తో ఎలాగైనా అలరించగలడు సూపర్ స్టార్. కానీ పంపిణీదారులు ఎదుర్కొన్న ఆర్ధిక నష్టాలు భర్తీ చేయటానికి ఒక్క హిట్ ఎంత మాత్రం సరిపోదు కదా. అందుకే భరత్ అనే నేను చిత్రాన్ని తక్కువ మార్జిన్ తో పంపిణీదారులకి విక్రయించటానికి నిర్మాత డి.వి.వి.దానయ్య ని ఒప్పించిన మహేష్, తన డిస్ట్రిబ్యూటర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేసి అందుకు కావలసిన రేటు సర్దుబాట్లన్నీ సరిచూసుకుని వారికి హామీ ఇచ్చారు. అలానే తన తదుపరి 25 వ చిత్రం కూడా ఫాన్సీ రేట్లకి కాక పంపిణీదారులకి అందుబాటులో రేట్లకి విక్రయించే విధంగా హామీ ఇచ్చాడట. స్పైడర్ చిత్రాన్ని నైజామ్ ప్రాంతానికి పంపిణీ చేసి భారీగా నష్టపోయిన దిల్ రాజు మహేష్ నటించబోయే 25 వ చిత్రానికి నిర్మాత కావటం విశేషం.

