మళ్లీ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడంట!

ఎన్టీఆర్ హోస్టింగ్ లో వస్తున్న బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్స్ అందరిలో హరి తేజ బలమైన కంటెస్టెంట్ లా కనిపిస్తుందని అంటున్నారు. షోలో అల్లరి చేస్తూ అందరిని ఆటపట్టిస్తూ దూసుకుపోతున్న హరితేజ అందరికి టీవీ సీరియల్స్ లో పరిచయమే.... కానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ... ఆ' సినిమాలో మాత్రం సూర్య కాంతంలా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో త్రివిక్రమ్ ఇచ్చిన అవకాశాన్ని హరితేజ సద్వినియోగం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోతో హరితేజకు మరిన్ని సినిమా అవకాశాలు రావొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. హరితేజ ఎనర్జీకి బిగ్ బాస్ హోస్ట్ ఎన్టీఆర్ కూడా బాగానే ముచ్చట పడుతున్నాడు.
అయితే హరితేజకు ఇప్పుడొక అదిరిపోయే అవకాశం తగిలింది అంటున్నారు. అదేమిటంటే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాలో హరితేజని ఒక కీలక పాత్రకి దర్శకుడు త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి 'అ.. ఆ' సినిమాలో హరితేజ నటనకు, బిగ్ బాస్ షోలో హరితేజ రియాలిటీకి ముగ్దుడైన త్రివిక్రమ్ ఆమెను దృష్టిలో ఉంచుకునే ఒక బలమైన పాత్ర రాసుకున్నట్టుగా చెబుతున్నారు. నిజంగా హరితేజకి త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమాలో బెర్త్ గనక కన్ఫర్మ్ అయితే హరితేజ జాక్ పాట్ కొట్టినట్టే అంటున్నారు.
మరి 'అ... ఆ' సినిమాతో త్రివిక్రమ్ ని ఇంప్రెస్స్ చేసిన హరి ఇప్పుడు బిగ్ బాస్ షో తో ఇంప్రెస్స్ చేసి..... మరి వారి కలయికలో రాబోతున్న సినిమాలో నటించి ఇద్దరినీ ఒకేసారి ఇంప్రెస్స్ చెయ్యడానికి రెడీ అవుతుందన్నమాట. ఇక బిగ్ బాస్ షో లో ఆమె చెప్పిన హరికథ స్టయిల్ కి ఫిదా అయిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆమె ఆ షో విన్ అవ్వాలని కోరుకుంటున్నారు.

