మరో అవతారమెత్తనున్న కమెడియన్!!

ఇండస్ట్రీలోకి కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చి హీరోగా సెటిల్ అయ్యాడు కమెడియన్ సునీల్. కామెడీతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్న సునీల్ చాలా కలం తర్వాత 'అందాల రాముడు'తో హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఇక తర్వాత వచ్చిన సినిమాలు సునీల్ హీరోగా పర్వాలేదనిపించేలా వున్నాయి. ఇక కమెడియన్ జాబ్ కి బై బై చెప్పేసి హీరోగా సెటిల్ అయిపోయాడు. హీరోగా కూడా బిజీ అయిన సునీల్ ఈమధ్యన హిట్స్ లేక చతికిల పడుతున్నాడు. ఒకే ఒక హిట్ కోసం తెగ ఎదురు చూస్తున్నాడు. ఇక హీరోగా సునీల్ పనికిరాడనే స్టేజి లో సునీల్ ఉన్నాడంటే నమ్మండి. ఎందుకంటే ఈ మధ్యన వచ్చిన సునీల్ సినిమాలు ప్రేక్షకులు మెచ్చేలా లేవని అందరూ చెబుతున్నారు... అంటే సునీల్ హీరోగా ఎంతకు దిగజారిపోయాడో కదా...!
ఇక సునీల్ ఇప్పుడు మరో పాత్రతో ఇండస్ట్రీ లో పాతుకుపోవడానికి రెడీ అవుతున్నాడు. కమెడియన్ గా వచ్చిన సునీల్ ఇప్పుడు విలన్ అవతారం ఎత్తనున్నాడని సమాచారం. ఇప్పటికే సునీల్ చాలా ఇంటర్వూస్ లో నేను అసలు సినిమా ఇండస్ట్రీ లోకి విలన్ అవుదామని వస్తే నన్ను కమెడియన్ చేశారని చెప్పుకొచ్చాడు. ఇక సునీల్ ఏం అవుదామని ఇండస్ట్రీ లో కాలుపెట్టాడో ఇప్పుడు అది నెరవేర బోతుందన్నమాట. పాపం సునీల్ హీరో రేంజ్ నుండి విలన్ రేంజ్ కి దిగిపోయాడనే కామెంట్స్ వినబడుతున్నాయి. అయినా హీరోలుగా చేసిన యువ హీరోలు ఇప్పుడు విలన్స్ గా ట్రై చేసి సక్సెస్ అయ్యారు. మరి సునీల్ కూడా విలన్ గా తన పవర్ చూపించి సక్సెస్ అవుతాడేమో చూద్దాం.

