మనోడు బాలీవుడ్ వాడైపోతాడేమో..?

సినీ ఇండస్ట్రీలో పాతుకుపోవాలంటే టాలెంట్ చాలా అవసరం. వాళ్ళకి మొదటి అవకాశం వచ్చిందంటే చాలు చివరి అవకాశం వరకు తమ టాలెంట్ ని చూపిస్తూనే వుంటారు. మన టాలీవుడ్ లో అయితే టాలెంట్ వున్నవారు బాగానే వున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్స్ కి మంచి ఆదరణ దక్కుతోంది. మన తెలుగు సినిమా ప్రేక్షకులకి వాళ్ళ అభిమాన హీరోస్ డాన్స్ చేస్తూ వుంటే ఈలలు వేస్తూ చూస్తూ ఉండిపోతారు.
ఇక మన పరిశ్రమలో డాన్స్ వేసే హీరోస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో డాన్స్ చేయించే కొరియోగ్రాఫర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. మన హీరోల డ్యాన్సులను చూసి పరభాషా నటులు కూడా చాలా ఇష్టపడుతున్నారు. దీంతో వారి సినిమాలకు కూడా టీ టౌన్ కొరియోగ్రాఫర్స్ ని తీసుకెళుతున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ వారిలో మొదట వున్నాడు. తెలుగులో చిరంజీవి లాంటి పెద్ద హీరోకి కొరియోగ్రాఫర్ గా చేసే ఛాన్స్ కూడా వచ్చింది.
బాలీవుడ్ లో జయహో సినిమాలో సల్మాన్ ఖాన్ తో స్టెప్పులు వేయించే అవకాశం దక్కించుకున్న జానీ మాస్టర్ కి, ఇపుడు అదే బాటలో అమీర్ ఖాన్ తో స్టెప్పులు వేయించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అమీర్ ఖాన్ తో దిగిన ఒక ఫొటోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి త్వరలోనే ఆయనతో వర్క్ చేయబోతున్నట్లు చెప్పాడు ఈ కొరియోగ్రాఫర్. ఇలాంటి ఇంకో రెండో మూడు ఛాన్స్ లు వస్తే.. ఇక జానీ మాస్టర్ కూడా బాలీవుడ్ వాడైపోవడం ఖాయం.

