మత్తెక్కిస్తున్నారుగా...!!

'బాహుబలి, ఘాజి' వంటి హిట్స్ తో మంచి స్పీడు మీదున్న రానా ఇప్పుడు తేజ డైరెక్షన్ లో 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రానాకీ జోడిగా కాజల్ అగర్వాల్, కేథరిన్ థెరిస్సాలు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేనెలలో విడుదల కానుంది. ఇక షూటింగ్ కంప్లీట్ కావడంతో పబ్లిసిటీ కార్యక్రమాలమీద ఫోకస్ చేసింది నేనే రాజు... చిత్ర యూనిట్. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఫోటో గ్రాఫ్స్ తో కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తుంది.
అయితే తేజ చిత్రాలు వరుసగా ప్లాపయినప్పటికీ ఇప్పుడు రానా హీరోగా వస్తున్న నేనే రాజు - నేనే మంత్రి చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఇక ఈ చిత్రంలో రానా చెప్పే డైలాగ్స్ మాత్రమే కాకుండా కాజల్ సాంప్రదాయకంగా అందంగా కనిస్తుంది. మరో పక్క కేథరిన్ దమ్ముకొట్టే మోడరన్ అమ్మాయిగా కనబడుతుంది. ఇక ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచేలా చిత్ర యూనిట్ రకరకాల పద్ధతులు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇపుడు రానా, కాజల్ తో రొమాన్స్ చేస్తున్న పిక్ ని వదిలింది. రానా, కాజల్ తో చేసే రొమాన్సుని మనం ట్రైలర్ లో వీక్షించినప్పటికీ.... ఇప్పుడు చూసే ఈ పిక్ లో రొమాన్స్ ఏ విధంగా పండించారో అర్ధమవుతుంది.
కాజల్ సంప్రదాయంగా చీరకట్టులో మెరిసిపోతుంటే రానా, కాజల్ తో ఉన్న క్లోజ్ నెస్ చూస్తుంటే సినిమాలో ఇంకెంతగా రొమాన్స్ పండించారో అనిపిస్తుంది. మరి మనం ఆ రొమాన్స్ ని కన్నులారా వీక్షించాలంటే ఆగష్టు 11 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

