Thu Mar 26 2026 02:46:03 GMT+0530 (India Standard Time)
మణిశర్మ స్టూడియో లో దోపిడి?

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కు చెందిన మ్యూజిక్ స్టూడియో శనివారం నాడు దోపిడీకి గురైనట్లు గా సమాచారం అందుతుంది జనవరి 27న పనిమీద హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లిన మణిశర్మ ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చాక ఆఫీస్ కు వచ్చి చూస్తే ఆఫీస్ అల్మారా లో ఉండే 4.50 లక్షలు మాయమైనట్లు గ్రహించాడు.
అంత డబ్బు కనబడకపోవడంతో... మణిశర్మ మేనేజర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. అయితే మణిశర్మ పర్సనల్ అసిస్టెంట్ పై మణిశర్మ మేనేజర్ అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు .
ప్రస్తుతం పెద్దగా ఫామ్ లో లేని మణిశర్మ ప్రస్తుతం నాని మరియు నాగార్జున మల్టీస్టారర్ తో పాటుగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎమ్మెల్యే చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Next Story

