భారీ వసూళ్లతో లాభాల పంట పండిస్తోంది

విజయ్ దేవరకొండా హీరోగా వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రం గత శుక్రవారం విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం పూర్తిగా నెగెటివ్ పబ్లిసిటీతో మొదలై సినిమా విడుదల వరకు రకరకాల కాంట్రవర్సీలతో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. వచ్చిందే తడువుగా ఈ సినిమాలో విజయ్ నటన, అలాగే డైలాగ్స్ అన్ని యువతకి నేరుగా కనెక్ట్ అవడం... ఈ తరం దేవదాసుని తలపించేలా ఈ సినిమా ఉండడం వంటి పాజిటివ్ టాక్ తో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా డైరెక్టర్ సందీప్ వంగా, హీరో విజయ్ లు ఫుల్ ఖుషీగా ఈ 'అర్జున్ రెడ్డి' విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాకి వచ్చినకలెక్షన్స్ చూస్తున్నవారికి అసలు ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు... అలాగే నిర్మాతలకు, కొన్న బయ్యర్లకు ఎంత లాభాలు వచ్చాయనే హాట్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. అయితే ఈ 'అర్జున్ రెడ్డి' చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది. కేవలం సందీప్ వంగా సోదరుడు ఈసినిమాకి 2 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఖర్చు చేసాడట. అయితే సినిమాకి ఇంత తక్కువ బడ్జెట్ పెట్టినప్పటికీ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ మాత్రం ఈ సినిమాకి రిచ్ లుక్ తెచ్చేందుకు ఎంతగా కష్టపడ్డారో 'అర్జున్ రెడ్డి' ప్రతి ఫ్రెమ్ లో అర్ధమవుతుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని విడుదలకు ఒక నెల ముందే మూడు కోట్ల లాభానికి అంటే 5.5 కోట్లకి ఏషియన్ సినిమా వాళ్ళకి అమ్మేసారట 'అర్జున్ రెడ్డి' నిర్మాతలు.
ఇక నిర్మాతలు విడుదలకు ముందే మూడు కోట్ల లాభం పొందగా... సినిమా కొన్న ఏషియన్ సినిమా వాళ్ళు మాత్రం బోలెడు లాభాలు జేబులో వేసుకోబోతున్నారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాని 5.5 కోట్లకి కొన్న కూడా మరొక కోటి రూపాయలను 'అర్జున్ రెడ్డి' పబ్లిసిటీకి పెట్టగా... మొత్తం వారి ఖర్చు 6.5 కోట్లు అయ్యిందట. కానీ 'అర్జున్ రెడ్డి' మాత్రం విడుదలైన రెండుమూడు రోజుల్లోనే ఈ మొత్తం పెట్టుబడిని రాబట్టగలిగిందని లాంగ్ రన్ లో మరో 20 నుండి 25 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు. ఈలెక్కన ఒక్క అర్జున్ రెడ్డి హిట్ తోనే ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు మాత్రం భారీ లాభాలు మూటగట్టుకోబోతున్నారన్నమాట.