భారీగా పెంచేసిందట!!

బాహుబలి చిత్రం విజయంతో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఆ చిత్రంలో నటించిన నటీనటులు, ఆ చిత్రంలో నటించిన ప్రభాస్, అనుష్క, రాణాలకు ఎంతగా పేరొచ్చిందో రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటివారికి కూడా అంతే గొప్ప పేరొచ్చింది. ఇక పేరు ప్రతిష్ఠలతోపాటే వారికి అవకాశాలు కూడా దండిగా వచ్చిపడుతున్నాయి. ఇందులో నటించిన నటీనటులు తమ రెమ్యునరేషన్ ని రెండింతలు చేసిపారేసి నిర్మాతలకు చుక్కలు చూపెడుతున్నారట.
బాహుబలిలో శివగామి పాత్ర చేసిన రమ్యకృష్ణ కూడా తన రెమ్యునేషన్ ని భారీగా పెంచేసింది అంటున్నారు. బాహుబలిలో శివగామి గా రమ్యకృష్ణ ఆహార్యం, నటనతో ఎంతగా మెప్పించిందో తెలిసిన విషయమే. ఇక శివగామిగా పేరు కొట్టేసిన రమ్యకృష్ణ ఇప్పుడు తన పారితోషకాన్ని అమాంతం పెంచడమే కాదు... రెండింతలు చేసేసిందట. రెండు కోట్ల పారితోషకం ఇస్తేనే కేరెక్టర్స్ చేస్తానని అంటుందట. అయితే అన్ని సినిమాలు బాహుబలిలా వుండవు కదా.. అంటున్నారు.
రమ్యకృష్ణ మరీ బాహుబలి రేంజ్ లో డిమాండ్ చేస్తే ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలంటే నిర్మతలు తెగ ఆలోచిస్తారు. అయినా రమ్యకృష్ణ కి ఈ విషయంలో ఎవరు ఎన్ని విధాల నచ్చజెప్పాలని చూస్తున్నా వినడం లేదట.

