బెల్లకొండకి వాయిస్ పవర్ లేదా..?

బోయపాటి అంటేనే యాక్షన్. యాక్షన్ అంటేనే బోయపాటి అనే ముద్ర టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు బోయపాటి తాజా చిత్రం 'జయ జానకి నాయక' బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా మొదలైనప్పటినుండి ఈ సినిమా రొమాంటిక్ గా ఉంటుందా? లేకుంటే మాస్ తరహాగా ఉంటుందా..? అనే కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నాడు బోయపాటి. మొదట్లో ఇదొక లవ్ స్టోరీగా తెరకెక్కుతోందని... బోయపాటి తన మార్క్ యాక్షన్ ని వదిలేశాడని అనుకునే లోపు మళ్ళీ నేను మారలేదు నా మార్క్ యాక్షన్ ఉందని నిరూపించాడు.
ఈ చిత్రం ఈనెల 11 న విడుదలకు సిద్ధమవుతుండగా.... 'జయ జానకి నాయక' ఆడియో వేడుకని గ్రాండ్ లెవల్లో నిర్వహించారు. ఆడియో సందర్భంగా 'జయ జానకి నాయక' చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేసింది. 'జయ జానకి నాయక' చిత్ర ట్రయిలర్ మొత్తం యాక్షన్ తో నింపేసాడు బోయపాటి. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ పార్ట్ ఆకట్టుకునేలా వుంది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ గా కనిపిస్తూనే ట్రెడిషనల్ గా వుంది. ఇక ఐటెం గర్ల్ కేథరిన్, మరో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ గ్లామర్ కూడా 'జయ జానకి నాయక' కి అదనపు ఆకర్షణ. ఇక శరత్ కుమార్ సాఫ్ట్ గా కనిపిస్తే విలన్ గా చేస్తున్న జగపతి బాబు మాత్రం విశ్వరూపం చూపిస్తున్నాడు. జగపతి బాబు 'జయ జానకి నాయక' లోని కేరెక్టర్ ని చూస్తుంటే 'లెజెండ్' లో జగపతి బాబు చేసిన విలనిజం గుర్తొస్తుంది.
ట్రైలర్ అంతా యాక్షన్ సన్నివేశాలతో నింపేసినప్పటికీ..... అంత మాస్ గా చూపించిన బెల్లంకొండ డైలాగ్ డెలివరీ మాత్రం మైనస్ అనే చెప్పాలి. బెల్లంకొండ పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతుంటే అవి మాత్రం అంత పవర్ ఫుల్ గా ప్రేక్షకులకు రీచ్ అవ్వవనిపిస్తుంది. అంత పవర్ ఫుల్ వాయిస్ బెల్లంకొండకి లేకపోవడం మాత్రం మైనస్ అనే చెప్పాలి. ఇకపోతే దేవిశ్రీ అందించిన బ్యగ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. అలాగే రుషి పంజాబీ ఫోటోగ్రఫి ఆకట్టుకునేలా వుంది.

