బాహుబలి లీక్ తో సేఫ్ ఐన కింగ్ నాగార్జున

పైరసీ బెడద తోనే మన నిర్మాతలు తలలు బాదుకుంటుంటే, ఇప్పుడు చిత్రం విడుదలకి ముందే లీక్ అవుతున్న సినిమా ఫుటేజ్ నిర్మాతలకు నిద్ర లేని రాత్రులు గడిపేలా చేస్తుంది. గతంలో అత్తారింటికి దారేది చిత్రం ఎడిటింగ్ రూమ్ నుంచి లీక్ కాగా, బాహుబలి ది బిగినింగ్ నిర్మాణాంతర కార్యక్రమాలలో ఉండగా విజువల్ ఎఫెక్ట్స్ విభాగం అశ్రద్ధ వలన ఫుటేజ్ లీక్ ఐయి పోలీస్ స్టేషన్ తలుపు తట్టాల్సి వచ్చింది దర్శక నిర్మాతలకు. ఇప్పుడు చిత్రీకరణ దశలో వున్న బాహుబలి ది కంక్లూషన్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురు ఐయ్యింది. తొమ్మిది నిమిషాల నిడివి వున్న ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
బాహుబలి చిత్ర నిర్మాతలు పోలీస్ శాఖ కు ఫిర్యాదు చేయగా పోలీస్ వారు దర్యాప్తు జరిపి ముందుగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి దగ్గర బాహుబలి ది కంక్లూషన్ తో పాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లలో ఓం నమో వెంకటేశాయ చిత్రానికి సంబంధించిన ఫుటేజ్ కూడా దొరికింది. కాగా ఇప్పటివరకు ఆ ఫుటేజ్ ని ఇతరులతో పంచుకోలేదు అని సదరు నేరస్థుడు పోలీస్ వారికి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. బాహుబలి లీక్ వ్యవహారం పై దర్యాప్తు ఆలస్యం ఐయి ఉంటే నెట్టింట్లో ఓం నమో వెంకటేశాయ లీక్ ఫుటేజీలు హల్చల్ చేసి ఉండేవి. దీనితో అక్కినేని నాగార్జున మరియు బృందం ఊపిరి పీల్చుకున్నారు.

