బాలీవుడ్‌కు సర్జికల్ స్ట్రైక్ : ఆగిన ఐశ్వర్య సినిమా

బాలీవుడ్ లో కరణ్ జోహార్ సినిమా ‘యే దిల్ హై ముష్కిల్’ విడుదలకు కష్టాలను ఎదుర్కొంటోంది. ఇందులో రీఎంట్రీ తర్వాత ఐశ్వర్యరాయ్ బచ్చన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సర్జికల్ దాడుల పుణ్యమాని భారత పాక్ ల మద్య దెబ్బతిన్న సంబంధాల నేపథ్యంలో.. మారిన పరిణామాలు బాలీవుడ్ లో మొట్టమొదటగా ఈ చిత్రం మీద ప్రభావం చూపిస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన నటుడు ఇందులో చేసినందువల్ల ఈ చిత్రాన్ని తమ రాష్ట్రాల్లో విడుదల చేయబోం అంటూ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా లకు చెందిన థియేటర్ యజమానులు ప్రకటించారు. ఆ నాలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల కావడం లేదు.
కరణ్ జోహార్ తీసిన ‘యే దిల్ హై ముష్కిల్’ చిత్రంలో లీడ్ రోల్‌ను ఐశ్వర్య రాయ్ బచ్చన్ చేశారు. మిగిలిన పాత్రల్లో రణబీర్ కపూర్, అనుష్క శర్మ ఉన్నారు. పాకిస్తాన్ కు చెందిన నటుడు ఫవాద్ ఖాన్ కూడా ఓ పాత్ర పోషించారు. నిజానికి అతనిది స్పెషల్ అపియరెన్స్ మాత్రమే. అయితే, అదే ఇప్పుడు సినిమాకు పెద్ద బ్రేక్ గా మారింది. డీజేగా చేసిన ఫవాద్ ఖాన్ పాత్ర నిడివిపరంగా చిన్నదే అయినా సినిమాకు బ్యాక్ బోన్ వంటిది అని చెప్పుకుంటున్నారు.

