బాలయ్య 102 కు కథలు చెప్తున్నా వాసు

నందమూరి బాల కృష్ణ 100 వ చిత్రం చిత్రీకరణ ముహూర్తం జరుపుకోకముందు నుంచే దర్శకుడు కృష్ణ వంశి పేరు బాలయ్య కాపౌండ్లో హల్చల్ చేసింది. దాదాపు రైతు అనే చిత్రం వీరి కలయికలో 100 వ చిత్రంగా ఖరారు అయిపోయినట్లు కథనాలు కూడా వచ్చాయి. కానీ బాలయ్య మాత్రం తన ల్యాండ్ మార్క్ చిత్రం బెంచ్ మార్క్ కావాలని చారిత్రాత్మక కథ పైగా ఎవరికీ తెలియని శాతకర్ణి వంటి యోధుడి కథ కావటంతో క్రిష్ కి ఆ అవకాశం ఇచ్చి కృష్ణ వంశి రైతు ని తదుపరి చిత్రంగా చేయటానికి నిశయించుకున్నారు బాలయ్య. కాగా నేటికీ ఇంకా గౌతమీ పుత్ర శాతకర్ణి పనులు పూర్తి కాలేదు. కానీ బాలయ్య 102 వ చిత్రానికి కథలు తీసుకు వస్తున్నారు ప్రముఖ దర్శకుడు పి.వాసు.
గతంలో పి.వాసు దర్శకత్వంలో మహారథి చిత్రం చేసిన బాలయ్య కోలుకోలేని ఎదురు దెబ్బ తిన్నారు. పైగా వేణు వెంటనే కృష్ణార్జున, కథానాయకుడు, నాగవల్లి చిత్రాల పరాభవంలో కూరుకుపోయారు పి.వాసు. తెలుగులో ఇక ప్రయత్నాలు కలిసిరావని కన్నడ లో శివ లింగ చిత్రం చేసి విజయం అందుకున్నారు. ఆ చిత్ర 100 రోజుల వేడుకకు బాలయ్యను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. అదే తరుణంలో శివ లింగ తెలుగు రీమేక్ లో బాలయ్య ను నటింపజేసే విధంగా పావులు కదిపిన పి.వాసు కి బాలయ్య నుంచి తిరస్కారమే ఎదురు ఐయ్యింది. ఇప్పుడు మరో కథ తో స్ట్రెయిట్ తెలుగు ఫిలిం చెయ్యటానికి బాలయ్యను సంప్రదించగా ఆ కథ కూడా బాలయ్య మెప్పు పొందలేక పోవటంతో ఆయన సున్నితంగా తిరస్కరించారు.
మరి రైతు చిత్రం పట్టాలెక్కి పూర్తి అయ్యేలోపు పి.వాసు బాలయ్య చేత వేరే ఏదైనా కథ ఒప్పించి 102 వ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపడతారో లేదో చూడాలి.

