బాలయ్య స్పీడు అందుకోవడం కష్టమే

బాలకృష్ణ 102 వ చిత్రం 'జై సింహ' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అప్పుడే 75 శాతంపైనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని కె ఎస్ రవికుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. సి కళ్యాణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్ కాగా... హరిప్రియ, నటాషా దోషి లు కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనబడతాడనే సమచారం ఉంది. ఇకపోతే ఈ సినిమా కోసం బాలకృష్ణ విరామమే లేకుండా పని చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా టైటిల్ లోగోతో పాటే 'జై సింహ' గా బాలయ్య లుక్ ని ఈ నెల మొదటి వారంలోనే విడుదల చేసింది చిత్ర బృందం. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హరిప్రియ, బాలకృష్ణ మధ్య జరిగిన చిత్రీకరణకు సంబందించిన కొన్ని ఫొటోస్ ని హరిప్రియ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ తోపాటు 'నేను జైసింహా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసినప్పటి ఫోటో ఇది. అలాగే డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారి దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. అంతే కాదు.. ఎంతో పరిజ్ఞానం కలిగిన బాలకృష్ణ గారితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. జై సింహ టీంను ఇప్పటికే మిస్ అవుతున్నాను' అంటూ పోస్ట్ చేసింది.
మరి బాలయ్య బాబుతో మొదటి సారి నటిస్తున్న హరిప్రియ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకే ఇలా తనతో బాలకృష్ణ ఉన్న ఫొటోస్ ని పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో బాలకృష్ణ 'జై సింహ' లుక్ లో అదరగొడుతుంటే... హరిప్రియ మాత్రం చీర కట్టుకుని సంప్రదాయంగా కనబడుతుంది. మరి బాలకృష్ణ మరో పక్క నయనతారని బైక్ మీద కూర్చోబెట్టుకుని రైడ్ చేసే మరో పిక్ కూడా సోషల్ ఇండియాలో లీక్ అయ్యింది. ఈ ఫొటోలో బాలయ్య సీరియస్ గా బండి డ్రైవ్ చేస్తుంటే నయనతార వెనకగా కూర్చుని ఉన్న ఫోటో నెట్ లో వైరల్ అయ్యింది.

