బాలయ్య సందడి షురూ!!

బాలకృష్ణ బంపర్ స్పీడులో దూసుకుపోతున్నాడు. శాతకర్ణి ని అలా విడుదల చేసాడో లేదో... ఇలా పైసా వసూల్ ని పట్టాలెక్కించాడు. పైసా వసూల్ విడుదల కాకముందే కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహ సినిమాని మొదలెట్టేసి అది కూడా సంక్రాంతికి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ సినిమా అలా విడుదలవుతుందో లేదో ఇలా తన తండ్రి బయో పిక్ ని తెరకెక్కించడానికి సిద్ధపడుతున్నాడు . మరి బాలయ్య స్పీడు చూస్తుంటే మాములుగా ముచ్చట వెయ్యడం లేదు. ఇకపోతే జై సింహ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోవడమే కాదు ఆ లెవల్లోనే పబ్లిసిటీని కూడా మొదలెట్టేసింది.
ఫస్ట్ లుక్ ఎప్పుడంటే...
సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో నయనతార, నాటాషా జోషి, హరిప్రియ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ నెల మొదటి వారంలో జై సింహ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన చిత్ర బృందం ఇప్పుడు జై సింహ ఆడియో వేడుకకి కూడా తేదీని ఫిక్స్ చేసేసుకుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న జై సింహ పాటల వేడుకని డిసెంబర్ 23 న జరపబోతున్నారట. ఇక ఈ వేడుకని డిసెంబర్ 23 న విజయవాడ వేదికగా నిర్వహించబోతున్నట్లుగా సమాచారం.
పవర్ ఫుల్ రోల్....
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ గా కనబడబడబోతున్నాడనే విషయం జై సింహ ఫస్ట్ లుక్ లోనే అర్ధమయ్యింది. రెండు పాత్రల్లో బాలకృష్ణ జై సింహ లో అలరించనున్నాడనే విషయం కూడా ప్రచారంలో ఉంది. ఇకపోతే డిసెంబర్ 23 న ఆడియో నిర్వహించి సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చెయ్యాలని భావిస్తున్నారు నిర్మాత సి కళ్యాణ్.
- Tags
- బాలకృష్ణ

