Thu Dec 25 2025 01:51:31 GMT+0000 (Coordinated Universal Time)
బాబోయ్ టైటిల్లో ఇదేం వెరైటీ!!

రామ్ చరణ్ - సుకుమార్ డైరెక్షన్ లో ఒక ప్రేమకథా చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ధ్రువ చిత్రం విడుదలకాగానే సుకుమార్ కాంబినేషన్ లో చరణ్ నటిస్తాడు. ఇక ఈ చిత్రం లవ్ జోనర్ ఉంటుందని అంటున్నారు. రామ్ చరణ్ లవర్ బాయ్ గా నటిస్తాడని టాక్. ఇక ఈ సినిమాకి సంబందించి ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తుంది. సుకుమార్ తన చిత్రాలకు వెరైటీ టైటిల్స్ ని పెడుతూ ఉంటాడు. చాలా సినిమాలుకు వెరైటి టైటిల్స్ తో ప్రేక్షకులని తికమక పెడుతుంటాడు సుకుమార్. ఇప్పుడు రామ్ చరణ్ తో తియ్యబోయే సినిమాకి కూడా సుకుమార్ ఒక వెరైటీ టైటిల్ పెట్టాడని వార్తలొస్తున్నాయి. అందుకే ‘ఫేస్బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 పీఎం’ లాంటి టైటిల్ అయితే అందరికి బాగా కనెక్ట్ అవుతుందని సుకుమార్ భావిస్తున్నాడట. అందుకే ఇలా వెరైటీగా ఆలోచించాడని అంటున్నారు.
అయితే ఈ టైటిల్ విషయంలో ఇంకా రామ్ చరణ్ ఒప్పుకున్నట్లుగాని... ఆ టైటిల్ ఖచ్చితం గా చరణ్ సినిమాకే సుకుమార్ పెడుతున్నట్లు గాని ఎక్కడా ఆఫిసియల్ అనౌన్స్ మెంట్ అయితే లేదు. ఇకపోతే ఈ సినిమాని సుకుమార్ 60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడని సమాచారం. అసలు మరోపక్క ప్రేమకథాగా తీయబోయే ఈ చిత్రానికి ఇంత భారీ బడ్జెట్ అవసరమా అనే పెదవివిరుపులు కూడా మొదలయ్యాయని అంటున్నారు.
Next Story

