బాబు పాత్రకి జేడీనా?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గా తెరకెక్కించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి ఫుల్ గా పబ్లిసిటీ చేసేస్తున్నాడు. సినిమా మొదలు పెట్టకముందే లక్షిస్ ఎన్టీఆర్ విషయంలో వర్మ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి నిర్మాతగా వైసిపి నేత రాకేష్ రెడ్డిని తీసుకోవడం, రోజాకి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో ఒక కీలక పాత్ర ఆఫర్ చెయ్యడం.. ఒకటేమిటి తెలుగుదేశం నేతలతో రోజూ యుద్ధం చేస్తూనే వున్నాడు. గత 20 రోజులనుండి నిన్నమొన్నటివరకు వర్మ పేరు రోజు మీడియాలో నానుతూనే ఉంది. ప్రస్తుతానికి కాస్త సైలెంట్ అయిన వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఎలాంటి నటులను ఎంపిక చేస్తాడో అనే ఆసక్తితో తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తుంటే... వర్మ మాత్రం ఎన్టీఆర్ పాత్రకి కొత్త నటుడిని... లక్ష్మి పార్వతి పాత్రకి కొత్త నటిని ఎంపిక చేస్తున్నట్లుగా ప్రకటించేశాడు.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో కీలక పాత్రలు అంటే ఎన్టీఆర్ పాత్రకి, లక్ష్మి పార్వతి పాత్రకి కట్ట నటులను ఎంపిక చేసిన వర్మ.. మరో కీల పాత్ర అంటే వర్మ తీసే సినిమాలో చంద్రబాబు పాత్రకి వర్మ ప్రియా శిష్యుడు జెడి చక్రవర్తిని తీసుకుంటున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ముంబై వర్గాలు. రామ్ గోపాల్ వర్మ తన శిష్యుడు జెడి చక్రవర్తిని చంద్రబాబు పాత్రకి కావాలని అడిగినట్లు...... ఇద్దరి మధ్యలో ముంబై సాక్షిగా చర్చలు జరిగినట్టు వినికిడి. ఇప్పటీకే వర్మ, జేడీని చంద్రబాబు పాత్రకి ఎంపిక చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. చంద్రబాబులా... జెడి చక్రవర్తి కూడా గెడ్డం పెంచుకుని ఉంటాడు కాబట్టి.. బాబు పాత్రకి జెడి కరెక్ట్ గా సెట్ అవుతాడని నెటిజెన్ల కూడా అంటున్నారు.
అయితే వర్మ, జెడి చక్రవర్తి ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో చంద్ర బాబు పాత్రకి ఎంపిక చేసాడు అనే విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

