Tue Dec 23 2025 17:25:35 GMT+0000 (Coordinated Universal Time)
బాదరబందీలో చిక్కుకున్న బడాహీరో!

టాలీవుడ్ లో పెద్ద నోట్ల రద్దు ప్రకంపనలు ఆషామాషీగా లేవు. కొంతమంది చిన్న చిన్న హీరోలు మోడీ ప్రకటనని సమర్ధించి ఆయనకి సెల్యూట్ చేశారు. మరికొంతమంది తమ స్పందనని వెరైటీ ట్వీట్స్ తో తెలిపారు. ఇక పెద్ద హీరోలుగా అనబడే ఒక్క హీరో కూడా మోడీ ప్రకటనకు అస్సలు స్పందించలేదు. ఒక్క స్టార్ హీరో కూడా మోడీ ప్రకటనను సమర్ధించలేదు. అసలు సమర్ధించటం అటుంచి అసలు తమ స్పందనని ఏ విధం గా తెలియజెయ్యలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో ఒక వార్త జోరుగా ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే ఒక బడా హీరో ఇంట్లో 25 కోట్లు ఉన్నాయని... ఆ డబ్బుని ఏ విధం గా మార్చాలో తెలియక తలపట్టుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ హీరోకి సంబంధించి బయట వ్యాపారులున్నాయి. ఇక ఇటు సినిమాల్లో అటు వ్యాపారం లో సంపాదించిన కొంత సొమ్ము ఒక పని మీద గత 4 రోజుల క్రితం ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడట. ఇక ఇంట్లో ఆ డబ్బు ఉండగానే మోడీగారు సడన్ గా పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో ఈ డబ్బుని బ్యాంకుల్లో ఏ విధంగా మార్చాలో అర్ధంగాక తెగ సతమతమవుతన్నాడట.
ఇక ఈడబ్బుని ఏం చెయ్యాలో పాలుపోక తన అత్యంత సన్నిహితులతో, ఆడిటర్లతో సమావేశం అయినట్లు ఇప్పుడు ప్రచారం జోరందుకుంది. ఇక ఈ డబ్బుని బ్యాంక్ లో జమ చెయ్యాలంటే ఖచ్చితమైన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. మరి ఆ డబ్బుని ఆ హీరోగారెలా సంపాదించారో గాని ఇప్పుడు మాత్రం మోదీగారి దెబ్బకి తల బొప్పికట్టిందని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
Next Story

