బాక్స్ బద్దలైపోవాల్సిందే!!

బాలకృష్ణ - పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇప్పటికే క్లైమాక్స్ షూట్ ని కంప్లీట్ చేసుకున్న ఈచిత్రం దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈచిత్రంలో బాలకృష్ణ కి జోడిగా శ్రియ శరణ్, ముస్కాన్, కైరా దత్ లు నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. అలాగే మొత్తం చిత్రమంతా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. అయితే రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా పూర్తి స్థాయి కమర్షియల్ ఫార్మాట్లో చేస్తున్న పూరి - బాలయ్య ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక బాలకృష్ణ అభిమానులకు ఎలాంటి డైలాగ్స్ కావాలో అలాంటి పంచ్ డైలాగ్స్ ఈ 'పైసా వసూల్' ఉంటాయని అంటున్నారు. అందుకు అనుగుణంగా పూరి ఈచిత్రాన్ని తెరకెక్కించినట్లు చెబుతున్నారు. మరి ఎంతటి డైలాగ్ ని అయినా బాలకృష్ణ ఏంతో సునాయాసంగా చెప్పగలడు. అందుకే చాలా భారీ డైలాగ్స్ ని ఈ చిత్రంలో పూరి పెట్టాడని అంటున్నారు. ఈ డైలాగ్స్ బాలకృష్ణ నోటి వెంట వెలువడుతుంటే బాక్స్ లు బద్దలవ్వాల్సిందే అని కూడా చెబుతున్నారు. ఇక ఈ డైలాగ్స్ కి థియేటర్స్ లో బాలయ్య బాబు అభిమానులు కుర్చీల్లో కూర్చోకుండా ఈలలు కేకలతో థియేటర్ ని మార్మోగించేస్తారని ఛాలెంజ్ చేస్తున్నారు.
ఇక బాలయ్య ఎనర్జీ, పూరి స్పీడ్ కలగలిసిన ఆ డైలాగ్స్ ఏ రేంజులో ఉంటాయో చూడాలంటే మనం సెప్టెంబర్ 29 వరకు ఆగాల్సిందే మరి.

