‘బలం’ పై ఆశపెట్టుకున్న గోపాల్

మాస్ కమర్షియల్ దర్శకుడు బి.గోపాల్ మస్కా తరువాత సుదీర్ఘ విరామం తీసుకున్నారు. ఆయన కోరి తీసుకున్న విరామం కొంత అయితే, పరిస్థితులు ఆయనకు కలిపించిన విరామం మరి కొంత. ఆ మధ్య నందమూరి బాల క్రిష్ణ తన 100 వ చిత్ర దర్శకత్వ అవకాశం బి.గోపాల్ కి ఇస్తున్నారు అని వార్తలు వినిపించినా, అది జరగలేదు. గోపి చంద్, నయనతారలు నాయకానాయికలు గా ఒక చిత్రం ప్రారంభించగా అది చిత్రీకరణ దశలోనే ఆగిపోయి దర్శకుడు బి.గోపాల్ ని మరింత కృంగదీసింది.
గోపి చంద్ ప్రస్తుతం ఏ.ఎం.రత్నం నిర్మాణంలో ఆయన కుమారుడు .ఏ.ఎం.జ్యోతి క్రిష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆక్సిజన్ చిత్రీకరణలో బిజీగా ఉండాగా, మరో పక్క నయనతార తెలుగు, తమిళ, మళయాళ భాషలలో అనేక అవకాశాలతో తీరిక లేక సతమతమవుతుంది. బి.గోపాల్ దర్శకత్వంలో ఆగిపోయిన చిత్రానికి చిత్రీకరణకు ఎదురైన ఇబ్బందులు అన్నీ సమసిపోయి డిసెంబర్ లోపు ఎలాగైనా గోపి, నయన్ ల కాల్ షీట్స్ సర్దుబాటు చేసుకుని టాకీ భాగం పూర్తి చెయ్యాలని నిర్మాత యోచిస్తున్నారు.
ఈ చిత్రానికి ఇటీవల బలం అనే పేరు ఖరారు చేసారు. ఈ సరైన బలం అనుకున్నా సమయానికి ప్రణాళిక ప్రకారం చిత్రీకరణ పూర్తి చేసుకుంటుందో లేక బి.గోపాల్ ని మరింత నిరాశ పరుస్తుందో చూడాలి.

