ఫస్ట్ హాఫ్ సేమ్ టు సేమ్... కానీ సెకండ్ హాఫ్

పవన్ కళ్యాణ్.... త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందనే అంటున్నారు గాని ఎక్కడా క్లారిటీ లేదు. ఇకపోతే PSPK25 చిత్రం టైటిల్ అజ్ఞాతవాసి అనేది దాదాపు ఫైనల్ అయినట్టే అంటున్నారు. ఇక టైటిల్ తోపాటు ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని కూడా దీపావళి కానుకగా విడుదల చేస్తారనే టాక్ వుంది. కానీ చిత్ర బృందం నుండి అధికారిక సమాచారం లేదు. అయితే దాదాపు అజ్ఞాతవాసి టైటిల్ ఫిక్స్ అని అంటున్నారు. ఇక ఈ సినిమాని జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మరి రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. పవన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు అనే న్యూస్ ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. అలాగే పవన్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయిన సంతోష్ శ్రీనివాస్ కూడా అప్పుడే పవన్ సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేసినట్లుగా చెబుతున్నారు. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని... అది కూడా తమిళంలో విజయ్ నటించిన తేరి సినిమా తరహాలో ఉంటుందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే కేవలం పవన్ - సంతోష్ కలయికలో వస్తున్న సినిమా ఫస్ట్ హాఫ్ మత్రమే తేరి సినిమాలాగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మొత్తం పూర్తి డిఫ్రెంట్ గా ఉంటుందట. అంటే తేరి సినిమాకి రీమేక్ అయితే కాదు అంటున్నారు. మరి తేరి సినిమా నుండి ఫస్ట్ హాఫ్ తీసుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మార్పలు చేర్పులు ఉంటాయంటున్నారు. చూద్దాం ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో

