ఫస్ట్ లవ్ లెటర్ 17 వయసులోనే అందుకున్నా?

ఊహలు గుసగుసలాడే సినిమాతో వెండితెరకు అరంగేట్రం చేసిన రాశి ఖన్నా అప్పుడే 15 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మొదట్లో యంగ్ హీరోలతో సరిపెట్టుకున్న రాశి ఖన్నా తర్వాత స్టార్ హీరో ఎన్టీఆర్ తో కలిసి జై లవ కుశ లో జోడి కట్టింది. కానీ రాశి ఖన్నా కి మాత్రం పెద్దగా లక్కు కలిసి రాలేదు. చిన్న చిన్న అవకాశాలు తప్ప మళ్ళీ పెద్ద హీరోల పక్కన ఛాన్స్ లు రాలేదు. కారణం ఆమె బొద్దుగా ఉండడమే. ఈ లోపు రాశి ఖన్నా కి మెగా హీరోలలో ఒకరితో లవ్ ఎఫ్ఫైర్ ఉందనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
అయితే రాశి ఖన్నా కి మొన్నీమధ్యనే వచ్చిన తొలిప్రేమ చిత్రంతో మళ్ళీ అదృష్టం కలిసొచ్చింది. ఆ సినిమా చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించడంతో రాశి ఖన్నా కి మళ్ళీ ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే నితిన్ పక్కన శ్రీనివాస్ కల్యాణంలో నటిస్తున్న రాశికి రాజమౌళి - ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల మల్టీస్టారర్ సినిమాలోనూ అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే రాశి ఖన్నా కి ఎలాంటి లవ్ ఎఫ్ఐర్స్ లేవంట. ప్రస్తుతం కెరీర్ మీద తన దృష్టి ఉందని.. ఇలాంటి సమయంలో లవ్ అని పెళ్లి అని ఆలోచించే తీరిక లేదని చెబుతుంది ఈ భామ.
అయితే అలీ తో జాలిగా అనే షోకి అతిధిగా వచ్చిన రాశి తన ప్రేమ గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ షోలో అలీ.. రాశి ఖన్నాని ప్రేమకి సంబంధించిన ఫస్టు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది?... అనే ప్రశ్నకు రాశి నా 17 యేళ్ల వయసులో ఫస్టు లవ్ ఇన్సిడెంట్ జరిగింది. ఢిల్లీలో స్కూల్లో నా సీనియర్ 18 ఏళ్ళ వయసున్న ఒకతను నాకు లవ్ లెటర్ రాశాడు. ఒక ఎర్ర గులాబీతో పాటు ఆ లవ్ లెటర్ ను తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక ఆ తరువాత కూడా చాలామంది లవ్ లెటర్స్ ఇవ్వడానికి ప్రయత్నించారు గానీ .. నేను మాత్రం తీసుకోలేదు అంటూ తనకు వచ్చిన లవ్ లెటర్స్ గురించి చెప్పింది భామ.

