ప్రేమికుల రోజు స్పెషల్ ఇదేనా దీపికా

పద్మావత్ చిత్రంతో ప్రపంచం మొత్తం దీపికా పదుకొనె పేరు ఒక లెవల్లో మార్మోగిపోవడమే కాదు... బాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా దీపిక నటించిన పద్మావత్ చిత్రం కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మరి పద్మవత్ చిత్రంలో తన లవర్ రణ్వీర్ సింగ్ తో నటించిన దీపికా పదుకొనె ఈ సినిమా విడుదల తర్వాత రణ్వీర్ ని దీపికా పెళ్లి చేసుకోబోతున్నట్లు... అది కూడా డెష్టినేషన్ వెడ్డింగ్ అన్నట్లుగా తెగ ప్రచారం జరిగింది. ఆ ప్రచారం అలా ఉంటె రేపు ప్రేమికుల రోజు సందర్భంగా దీపికా పదుకొనె తన మనసులో మాటను బయటపెట్టేసింది. అలాగే తన ప్రియుడు రణ్వీర్ సింగ్ పేరును ఎత్తకుండా బాగానే మేనేజ్ చేసింది.
ఎలా అంటే ప్రేమికుల రోజుకు సంబంధించినంత వరకు... ప్రతి రోజు కూడా లవ్ డే గా జరుపుకోవాలని తాను భావిస్తున్నట్లు సూటిగా సున్నితంగా చెప్పేసింది. మరి రణ్వీర్ సింగ్ తో పెళ్లెప్పుడో చెప్పని ఈ పొడుగు కాళ్ళ సుందరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెబుతుంది. తాను విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సప్నా దీదీ అనే చిత్రం కోసం ప్రస్తుతానికి రెడీ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ సప్నా దీదీ అనే చిత్రాన్ని దర్శకుడు విశాల్ భరద్వాజ్ మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించనున్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో కూడా దీపికా పదుకొనె మెయిన్ లీడ్ లో నటిస్తుండగా... ఇర్ఫాన్ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించనున్నాడట.