ప్రభాస్ 'భాగమతి' సినిమాకు దూరంగా ఎందుకు ఉంటున్నాడు?

ప్రభాస్ కి, అనుష్కకి మధ్య ఏదో ఉందని జాతీయ పత్రికలే కోడై కూయడంతో భాగమతి ప్రమోషన్లలో అనుష్క చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సినిమా గురించి అడగకుండా ప్రభాస్ గురించే ఎక్కువగా అడుగుతున్నారని మీడియాకి దూరంగా ఉంటుంది అనుష్క. అటు ప్రభాస్ కూడా భాగమతి ప్రొమోషన్స్ కి దూరంగానే వున్నాడు. ఇప్పటి వరకు ఏ ఈవెంట్ కి హాజరవలేదు.
సొంత బ్యానర్లో వచ్చినా....
తన సొంత బ్యానర్లో వచ్చిన సినిమా అయినప్పటికీ ప్రభాస్ మాత్రం దీనికి ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వడం లేదు. తన స్నేహితుల కోసం ప్రమోట్ చేస్తే అనుష్క కోసమే ప్రొమోషన్స్ కి వచ్చాడని వార్తలు వస్తాయి కాబ్బట్టి అనుష్క సినిమాకి ప్రభాస్ దూరంగా వుంటున్నాడట. అయితే భాగమతి పెద్ద హిట్ అయ్యి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ చిత్ర విజయోత్సవాన్ని భారీగా ప్లాన్ చేస్తోంది యువి క్రియేషన్స్.
ఈ ఈవెంట్ కు వస్తారా?
అయితే మరి ఈ ఈవెంట్ కు ప్రభాస్ డుమ్మా కొడతాడా లేక ముఖ్య అతిథిగా వచ్చి తన స్నేహితుల కోసం తన వంతు మాట సాయం చేసేస్తాడా అనేది చూడాలి. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయిన భాగమతి ఇప్పటి నుండి వచ్చే కలెక్షన్స్ అంతా లాభాలే. ఈమధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిన సినిమా ఇదేనట. ఎంసిఏ తర్వాత మళ్లీ థియేటర్లు కళ కళలాడుతున్నాయని మార్కెట్ వర్గాలు సంబరంగా వున్నాయి.
- Tags
- ప్రభాస్