Sat Jul 27 2024 01:18:08 GMT+0000 (Coordinated Universal Time)
పోలిసుల నుండి శ్రీకాంత్ కి నోటీసులు!
![పోలిసుల నుండి శ్రీకాంత్ కి నోటీసులు! పోలిసుల నుండి శ్రీకాంత్ కి నోటీసులు!](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2016/04/telugu-movie-mental-police-sreekanth.jpg)
శ్రీకాంత్ హీరోగా 'మెంటల్ పోలీస్' అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. కరణం పి.బాబ్జీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడీ సినిమా వివాదంలో పడింది. తమ మనోభావాలు దెబ్బతినేలా మెంటల్ పోలీస్ పేరుతో సినిమా నిర్మించినందుకు నిర్మాత, హీరో, దర్శకుడికి నోటీసులు పపించారు పోలీసులు. సమాజంలో పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా ఈ సినిమాకు పేరు పెట్టారని... వెంటనే ఆపేరును తొలగించాలని డిమాండ్ చేసింది పోలీసులు సంఘం. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story