'పైసా వసూల్' ఫస్ట్ డే పైసల్ చూశారూ.

బాలకృష్ణ - పూరి కాంబొలో వచ్చిన పైసా వసూల్ నిన్న శుక్రవారమే విడుదలై థియేటర్స్ లో దూసుకుపోతుంది. హైదరాబాద్ లో వరుసగా మూడు రోజులు సెలవలు రావడం సెప్టెంబర్ 5 న టీచర్స్ డే తో స్కూల్స్ అన్నిటికి సెలవు కూడా తోడవడంతో 'పైసా వసూల్' కలెక్షన్స్ బాగానే కొల్లగొట్టేలా కనబడుతుంది. ఈ సినిమాలో బాలయ్య నటనకు, ఆయన ఎనర్జీకి ఫుల్ మార్కులు పడుతుంటే పూరి మాత్రం తన టార్గెట్ రీచ్ అవ్వలేదనే టాక్ వినబడుతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ శ్రియ శరన్, ముస్కాన్, కైరాల అందాల ఆరబోత మాములుగా లేందంటున్నారు. అయితే ఈ వీకెండ్ సరైన సినిమాలు లేకపోవడం పైసావసూల్కి కలిసొస్తుందని కూడా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మిగతా ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా దాదాపు 8 కోట్లు రాబట్టినట్టు చెబుతున్నారు. బాలయ్య కెరీర్లో సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్ ఈ పైసా వసూల్ సాధించింది.
ఫస్ట్ డే ఏపీ & టీఎస్ షేర్ కోట్లలో
నైజాం - 1.64 కోట్లు
సీడెడ్- 1.80 కోట్లు
నెల్లూరు- 0.37
కృష్ణ- 0.52
గుంటూరు- 1.54
వైజాగ్- 0.80
తూర్పు గోదావరి - 0.70
పశ్చిమ గోదావరి- 0.58
ఫస్ట్ డే ఏపీ & టీఎస్ షేర్ 7.95