పెళ్ళికి ఎవ్వరిని పిలవరంట

అక్కినే నాగ చైతన్య - సమంత ప్రేమించుకుని పెళ్ళికి రెడీ అయ్యారు. అక్టోబర్ 6,7 తేదీల్లో వీరు గోవాలో హిందూ క్రిష్టియన్ పద్ధతుల్లో పెళ్ళి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ ఇప్పుడు పెద్దల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతానికి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న నాగ చైతన్య, సమంతలు ఒక పక్క షూటింగ్స్ మరో పక్క పెళ్లి పనులతో తీరికలేనంత బిజీగా వున్నారు. అయితే టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో సమంత బిజీగా ఉండగా... చైతు మాత్రం ఒక్క సినిమా తో బిజీగా వున్నాడు. అలాగే నాగ చైతన్య తాజా చిత్రం యుద్ధం శరణం వచ్చే నెల 8 న విడుదలకు సిద్దమవుతుంది. మరి చేతినిండా సినిమాలతో బిజీగా వున్న ఈ జంట పెళ్లి తర్వాత కూడా గ్యాప్ తీసుకోకుండా సినిమా షూటింగ్స్ కి హాజరవుతామని చెప్పిన సంగతి తెలిసిందే.
వీరి పెళ్లి ఏర్పాట్లలో అక్కినేని ఫ్యామిలీ కూడా నిమగ్నమై ఉంది. ఇకపోతే చైతు - సామ్ ల పెళ్లికి నాగార్జున ఇండస్ట్రీలో ఎవరెవని ఆహ్వానిస్తున్నాడో... అలాగే నాగ్ వ్యాపార మిత్రులు ఎవరెవరు ఈ పెళ్ళికి హాజరవుతున్నారు అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో నెలకొని వుంది. అలాగే పెళ్లి, రిసెప్షన్ లు ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కూడా. అయితే నాగ చైతన్య పెళ్లి విషయమై అమల అక్కినేని కొంత క్లారిటీ ఇచ్చేసింది. నాగ చైతన్య - సమంత లు పెళ్లి చాలా సింపుల్ గా ఉంటుందట.
ప్రస్తుతం నాగ చైతన్య - సమంత పెళ్లి పనుల్లో బిజీగా వున్నారని.... షాపింగ్స్ గట్రా పనులతో తీరికలేకుండా గడుపుతున్నారని చెప్పిన అమల... చైతు - సామ్ ల పెళ్లి చాలా సింపుల్ గా జరగబోతుందని... కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లిజరగబోతుందని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. నాగ చైతన్య - సమంతలు చూడముచ్చటైన జంట అని ముచ్చట పడింది. అయితే పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన అమల రిసెప్షన్ గురించి మాత్రం చెప్పలేదు. మరి రిసెప్షన్ అయినా గ్రాండ్ గా ఉంటుందో లేకుంటే అసలు ఉండదో.. వెయిట్ అండ్ సి.

