పెళ్లి వార్తలతో హార్ట్ అయిన హీరోయిన్!!

బాలీవుడ్ లో సినిమాల్తో కన్నా ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ తో షికార్ల విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సోనమ్ కపూర్ ఫ్యాషన్ కి ఐకాన్. ఎప్పుడు ఫ్యాషనబుల్ గా ఉండే సోనమ్ కపూర్ ఈ మధ్యన తన బాయ్ ఫ్రెండ్ విషయంలో తరుచూ న్యూస్ ఐకాన్ గా మారుతుంది. ఇక సోనమ్ బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని రెస్టారెంట్స్ లో బర్త్ డే పార్టీలంటూ హడావిడి చేస్తున్నట్లు ఆ మధ్యన వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. అలాగే సోనమ్ బాయ్ ఫ్రెండ్ తో త్వరలోనే పెళ్లిపీటలెక్కుతున్నట్లు కూడా వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు తనకి ఎంగేజ్మెంట్ విషయంలో వస్తున్న వార్తల మీద సోనమ్ కపూర్ మండి పడింది. తనకి ఒక బిజినెస్ మ్యాన్ తో పెళ్లి కుదిరి ఎంగేజ్మెంట్ అయ్యిందన్న విషయంలో తాను చాలా హార్ట్ అయ్యానంటుంది. తన పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా ఉంటే నేనే క్లారిటీ ఇస్తాను అంటూ నా సన్నిహితులు మీకు ఎదో చెప్పారంటూ ఏదేదో వార్తలు రాస్తున్నారు. అసలు నా గురించి మీకు చెప్పినవాళ్లంతా నా సన్నిహితులేనా? అది మీకు తెలుసా.... అసలు ఏదైనా విషయం ఉంటే నేనే మీకు డైరెక్ట్ గా చెబుతాను కదా... అంటూ ట్విట్టర్ సాక్షిగా చెలరేగిపోయింది సోనమ్.
ఇక ఇలాంటి వార్తలు పుట్టిస్తున్న జర్నలిస్టులను సోనమ్ కపూర్ మాములుగా తిట్టలేదు. అసలు ఉన్నవి లేనివి ఇలా ఎలా కల్పిస్తారంటూ మండిపడింది. సో అదండీ విషయం సోనమ్ పెళ్లి విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చేసిందన్నమాట.

