Sat Dec 27 2025 03:56:46 GMT+0000 (Coordinated Universal Time)
పూరీ బ్యాంకాక్ లోనే ఎందుకు వర్క్ చేస్తాడంటే?

అతి తక్కువ వ్యవధిలో అగ్ర స్థాయి తారాగణంతో కూడా చిత్రాలు పూర్తి చెయ్యటం ఇద్దరికే చెల్లుతుంది. ఒకరి సంచలనాత్మక దర్శకుడు, వివాదాస్పద వ్యక్తి రామ్ గోపాల్ వర్మ కాగా మరొకరు స్టైలిష్ ఫిలిం మేకర్ పూరి జగన్నాథ్. ఆయన చిత్రాల్లో ఏదో ఒక సందర్భములోనైనా బ్యాంకాక్ కనపడుతుంది. ఆయన కథ రాసుకునే చోటు కూడా అదే కావటం విశేషం. ఈ మధ్య ఆయన కూడా మూస ధోరణిలోనే కథలు చెప్తున్నారని, ఆయన చిత్రాలు ఆయనే కాపీ చేస్తున్నారని ఆరోపణలు తో పాటు, పూరి కథ రాయటానికి బ్యాంకాక్ కాక మరో ప్రదేశం ఎంచుకుంటే తప్ప ఈ మూస ధోరణి నుంచి బైటపడలేడని హాస్యభరితమైన విమర్శ కూడా పూరి పై వుంది.
అయితే పూరి జగన్నాథ్ మాత్రం అందరూ ఊహించుకునే వాటి కోసం ఆయన కథ సిద్ధం చేసుకోటానికి బ్యాంకాక్ ప్రదేశం ఎంచుకోలేదని వివరణ ఇచ్చాడు. "నేను బ్యాంకాక్ లో బాడీ మసాజ్ కోసమో, థాయ్ గర్ల్స్ తో శృంగారం కోసమో కథ తయారు చేసుకోటానికి అక్కడికి వెళ్ళటం లేదు. అక్కడ వాతావరణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనలాగా అక్కడ ప్రజలకు స్వార్ధం, కుళ్ళు వంటి లక్షణాలు ఏ మాత్రం వుండవు. అందరూ చిరు నవ్వుతో పలకరిస్తారు. ఆ నవ్వు కూడా సహజత్వంతో వచ్చే నవ్వు. మన లాగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో వారు ఎదురుపడరు." అని బ్యాంకాక్ దెస ప్రజల స్వభావాన్ని పొగిడేస్తూ ఎన్ని విమర్శలు ఎదురైనా తాను బ్యాంకాక్ వెళ్తూనే ఉంటానని పరోక్ష వ్యాఖ్య చేసి తేల్చేసాడు.
ఈ శుక్రవారం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇజం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తూ నిర్మించిన చిత్రం ఇజం .
Next Story

