పాపం 'స్పైడర్'... ఎంతపని జరిగింది

మురుగదాస్ 'స్పైడర్' చిత్రాన్ని మొదలెట్టినప్పుడే తెలుగు, తమిళంతో పాటే హిందీ మార్కెట్ మీద కూడా కన్నేశాడు. అందులోను మురుగదాస్ కి హిందీలో చాలా పరిచయాలు ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా మురుగదాస్ ఒక సినిమాని తెరకెక్కించాడు. అయితే 'స్పైడర్' చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏకకాలంలో రెండు వెర్షన్స్ ని సపరేట్ గా తెరకెక్కించినప్పటికీ... హిందీలో మాత్రం డబ్బింగ్ చేసి రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే 'స్పైడర్' షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. భారీగా ఖర్చు కూడా పెట్టించాడు. మరి మురుగదాస్ అనుకున్నట్టుగా 'స్పైడర్' కి బాలీవడ్ లో అసలు క్రేజ్ రాలేదు. అసలు 'స్పైడర్' టైటిల్ ని కూడా మురుగదాస్ బాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకునే పెట్టాడని టాక్.
'స్పైడర్' టైటిల్ లాంటి టైటిల్ ని బాలీవుడ్ జనాలు తొందరగా రిసీవ్ చేసుకుంటారని.. మురుగదాస్ భావించాడు. కానీ మురుగదాస్ ప్లాన్ బెడిసికొట్టినట్లుగానే ఉంది. అయితే బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ ద్వారానే 'బాహుబలి' సినిమాకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. కేవలం కరణ్ జోహార్ వల్లనే బాహుబలికి అక్కడ హిందీలో అంత క్రేజ్ వచ్చిందనేది జగమెరిగిన సత్యం. అయితే అలంటి భారీ నిర్మాణ సంస్థ ఏమన్నా 'స్పైడర్' కి దొరుకుతుందని భావించింది 'స్పైడర్' చిత్ర బృందం. కానీ అది జరగలేదు. ఆఖరికి హీరో మహేష్ భార్య నమ్రత బాలీవుడ్ పరిచయాలను వాడుకునైనా 'స్పైడర్' కి క్రేజ్ తెద్దామనుకుంటే అదీ.. తేడా కొట్టింది.
అయితే ఈ సినిమాని హిందీలోకి అనువదించి..... అక్కడి వాళ్లు అసలు పట్టించుకోక ఇబ్బందులు పడేకంటే... అసలు 'స్పైడర్' హిందీ రిలీజ్ ఆపేస్తేనే బెటర్ అనే ఉద్దేశ్యంలో చిత్ర బృందం ఉందట. అందుకే సెప్టెంబర్ 27న హిందీలో 'స్పైడర్ 'విడుదల ఆపేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే తెలుగు, తమిళంలో 'స్పైడర్' సినిమా విజయం సాధిస్తే అప్పుడు బాలీవుడ్ లో 'స్పైడర్' ని దించాలనే ఆలోచనలో ఉన్నారట. చూద్దాం అప్పుడైనా 'స్పైడర్' ని అనువదిస్తారో లేకుంటే మురుగదాస్ ఎవరినైనా బాలీవుడ్ హీరోతో 'స్పైడర్' రీమేక్ చేస్తాడో.. అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.