పాపం.. లక్ష్మి రాయ్

ఈమధ్యన సినిమా విడుదలకు ముందే పైరసీ జరుగుతుంది. కొన్ని విడుదలకు ముందే లీకవుతుంటే... మరికొన్ని మాత్రం సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్ లో లీకవుతుంది. పైరసీ రాయుళ్లు ఎలాంటి సినిమాని వదిలిపెట్టడం లేదు. ఈ పైరసీ మీద యుద్ధం చేస్తున్నప్పటికీ ప్రయోజనం అనే మాటే లేకుండా పోతుంది. అయితే ఇప్పుడు ఈ పైరసీ అనే భూతం కొత్తగా పుట్టిందేమి కాదు. ఏనాటి నుండో ఇది సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉంది.
ఇప్పుడు కూడా తాజాగా ఒక సినిమా ఈ పైరసీ భూతానికి బలైపోయింది. ఆ సినిమా మరేదో కాదు లక్ష్మి రాయ్ బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇద్దామనుకుని కలలు గన్న జూలీ 2 సినిమా నిన్న శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడి విల విల కొట్టుకుంది. లక్ష్మి రాయ్ ఈ సినిమాలో చాలా బోల్డ్ గా, హాట్ హాట్ అందాల ఆరబోతతో చెలరేగిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందు అంటే. సెన్సార్ సమస్యల వల్ల అనుకున్న టైం కి విడుదల కాకుండా ఎట్టకేలకు నిన్న శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది. అయితే సినిమా విడుదలకు ముందే జూలీ 2 లోని కొన్ని హాట్ సీన్స్ లీకైనట్లుగా వార్తలొచ్చాయి.
మరి ఇప్పుడు ఏకంగా సినిమానే పైరసీ బారిన పడడం అనేది చాలా దారుణమైన విషయం. ఎంతగా ఆవేశపడి మాట్లాడినా జరగాల్సిన నష్ట జరిగిపోయింది. మరి సినిమా ఫలితం ఎలా వున్నా ఇప్పుడు ఈ పైరసీ బాధ మాత్రం చిత్ర బృందానికి నిద్ర లేకుండా చేస్తుంది. పాపం లక్ష్మి రాయ్ బాలీవుడ్ లో చక్రం తిప్పుదామనుకుంటే ఇలా అయ్యిందేమిటి చెప్మా అంటూ కొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు.

