పవర్ స్టార్ క్రేజ్ కి సినిమా చేయటం కుదరదట

మెగా స్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం అనంతరం సినిమా చేస్తున్నప్పుడు రీమేక్ చిత్రాన్ని ఎంచుకోవటం పై సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్స్ ద్వారా బాహుబలి తో పోల్చి ఖైదీ నెం.150 ని తక్కువ చేసి మాట్లాడి మెగా హీరోల అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యాడు. సరిగ్గా ఏడాది గడిచాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞ్యాతవాసి విడుదలై ఘోర పరాజయం చెందటంతో మరొక సారి వర్మ తన ట్వీట్ లతో విమర్శలతో కూడిన పొగడ్తలని సంధించాడు. అయితే ఈ సారి విమర్శ పవర్ స్టార్ నటనపైకాక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పై, ఆయన క్రేజ్ పై మరల్చాడు ఆర్.జి.వి.
పవన్ కళ్యాణ్ అభిమానులందరూ అజ్ఞ్యాతవాసి డిసాస్టర్ కి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణం అని వారి అభిప్రాయాలని సోషల్ మీడియా ద్వారా బహిర్గత పరుస్తుంటే, వారికి పరోక్ష సమాధానంగా వర్మ, "అజ్ఞ్యాతవాసి రిజల్ట్ కి డైరెక్టర్ ని బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే పి కే లాంటి, ఆకాశం మీద దుప్పటి కప్పడం స్టీవెన్ స్పీల్బర్గ్ జేమ్స్ కెమరూన్ తరం కూడా కాదు." అంటూ ట్వీట్ చేసాడు.
ఇంతటితో ఆగకుండా తల్లి తోడుగా జేమ్స్ కెమరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ లతో పాటు చనిపోయిన ఆల్ఫ్రెడ్ హెచ్కోక్ బతికి తిరిగి వస్తూ ఫ్రాన్సిస్ కొప్పోలా మరియు అకిరా కురొసావా లని అసిస్టెంట్ డైరెక్టర్స్ గా తెచుకున్నప్పటికీ పి కే పవర్ ఇమేజ్ కి న్యాయం చేయలేరని తాను బలంగా నమ్ముతున్నాని, అందుకే కేవలం త్రివిక్రమ్ ని బ్లేమ్ చేయటం సబబు కాదని తన ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు రామ్ గోపాల్ వర్మ.

