పవర్ ప్యాకెడ్ టీజర్

మాస్ సినిమాలు చేయాలంటే రవి తేజ ముందు ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ గా అంతకుముందు రెండుమూడు సార్లు తన పవర్ ను బాగానే చూపించాడు. మరోసారి టచ్ చేసి చూడు లో పోలీస్ పాత్రతో రాబోతున్నాడు మాస్ రాజా రవి తేజ.
ఈ సినిమాకు కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ మొదటి సారి డైరెక్షన్ చేస్తున్నాడు. అతను స్క్రీన్ ప్లే రచయితగా సురేందర్ రెడ్డి వంటి దర్శకులకు సాయం అందించి టచ్ చేసి చూడుతో మెగా ఫోన్ ను పట్టాడు. ఇక ఇవాళ ఉదయం రిలీజ్ అయ్యిన టీజర్ విషయానికొస్తే.. స్లో మోషన్లో ఒక రౌడీని లాగి గాల్లోకి పడేసే షాట్ తో.. ఇదో మాస్ మసాలా కమర్షియల్ సినిమా అని చెప్పకనే చెప్పారు. టీజర్ చూస్తే స్టయిలిష్ గా.. అలాగే ప్రీతమ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ఇంపుగా ఉంది.
కాకపోతే రవి తేజ లుక్ గతంలో వచ్చిన 'పవర్' సినిమాలో ఎలా కనిపించాడో అదే తరహాలో కనిపిస్తున్నాడు. పైగా వయసైపోయినట్లు కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయాలని యోచించారు. కాని లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజయ్యే ఛాన్సుంది.

